Ramanujacharya : వెయ్యేళ్ల కిందటే కుల, మతాలు, వర్గ విభేదాలు, ఈర్ష్యలు, విద్వేషాలు ఉండ కూడదని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు(Ramanujacharya )అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
రూ. 1000 కోట్లతో 216 అడుగులతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విగ్రహాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం తనకు సంతోషం కలిగించిందని చెప్పారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వ కారణమన్నారు.
రామానుజుడి విగ్రహ ఏర్పాటు కోసం 10 ఏళ్లకు పైగా శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు చేసిన కృషి గొప్పదన్నారు. ఇంకొకరి వల్ల అయితే కాదన్నారు.
ఆయన బోధనల్ని ప్రతి ఒక్కరు ఆచరించాల్సన అవసరం ఉందన్నారు. ఏళ్లయినా తరాలు గడిచినా నేటి టెక్నాలజీ యుగంలో స్మరించు కుంటున్నామంటే రామానుజుడి(Ramanujacharya )ప్రాశస్త్యం ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు కేసీఆర్.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమాన్ని సందర్శించారు సీఎం. ఆశ్రమం అంతా కలియ తిరిగారు. యాగశాలను సందర్శించారు. అనంతరం 45 ఎకరాల ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజుడు విగ్రహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి కేసీఆర్ కు వివరాలు తెలిపారు. ఇక అగ్ని ప్రతిష్ట ప్రారంభ సూచికగా రామానుజుడి విగ్రహం పక్కనే ఏర్పాటు చేసిన మహా గంటను కేసీఆర్ మోగించారు.
తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా ఉండి పోతుందన్నారు సీఎం. ఆయన చేసిన బోధనలు ఆచరణీయమైనవని అన్నారు. ఈ సందర్భంగా రామానుజుడి విశిష్ట జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి చేరాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : భక్త జన సందోహం శ్రీరామనగరం