Srilanka Protest Comment : జనం ముందు పాలకులెంత
ఎక్కడా చోటు లేక లంకకు రాజపక్సే రిటర్న్
Srilanka Protest Comment : ప్రజలు తాము చెప్పినట్టు వింటారని, తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని, తమకు పట్టం కట్టారు కదా అని తమకు ఎదురే లేదని విర్రవీగితే చివరకు మిగిలేది విషాదమే.
చరిత్ర మొత్తం తరిచి చూస్తే ఏ పేజీ తిరిగి చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం యుద్దమే. తరాలు మారినా టెక్నాలజీ
విస్తరించినా కొత్త రకపు రాజ్యకాంక్ష బలీయంగా కొనసాగుతూ వస్తున్నది.
ఈ తరహా అధ్యత తరహా పాలనలోనూ ప్రజాస్వామ్యయుత దేశాలలో కనిపిస్తున్నదే. పేరుకే డెమోక్రసీ అయినా ఆచరణలో పూర్తిగా రాచరికపు పోకడలు పోతున్నాయి కొన్ని దేశాలు. వీటిని కాదనలేం.
ప్రజలు అణిగి మణిగి ఉన్నంత వరకు మాత్రమే. వారు గనుక ఉప్పెనలా ఉద్యమిస్తే రాజులు, రాజ్యాలు, పాలకులు తల వంచాల్సిందే. లేక పోతే చరిత్ర హీనులుగా లేదా జనాగ్రహం ధాటికి మాడి మసి అయి పోవాల్సిందే.
ఈ ఆధునిక కాలంలో కూడా ఆయా దేశాలు అరాచక పాలన సాగిస్తున్నాయి. అధికారం, వ్యామోహం, మతం, రాజకీయం, నేరం, మాఫియా ఇలా
చెప్పుకుంటూ పోతే ప్రతి అవలక్షణం దేశాలను కబళించి వేస్తున్నాయి.
ప్రభుత్వాలను వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, కార్పొరేట్లు డామినేట్ చేస్తున్నారు. ఆధిపత్య ధోరణి కొనసాగుతూనే ఉన్నది. ఆయుధాల అండ చూసుకొని కొందరు..మిస్సైళ్లను చూసుకొని మరికొందరు..సైబర్ అండ చూసుకొని చెలరేగి పోతున్నారు.
తమకు ఎదురే లేదంటూ బీరాలు పలుకుతున్నారు. యావత్ ప్రపంచం వద్దని చెప్పినా, తీర్మానం చేసినా, అభ్యర్థించినా ఒప్పుకోలేదు రష్యా.
ఆయిల్ , గనులు, డైమండ్లు, ఈ కామర్స్ బిజినెస్ , పోర్టులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచలోని ప్రతి వనరుల్ని కైవసం చేసుకునే
పనిలో పడ్డాయి కార్పొరేట్లు. వీళ్లు ఎక్కడా కనిపించరు.
కానీ ఆయా ప్రభుత్వాలను తమ కనుసన్నలతోనే శాసిస్తారు. వీరి మనుషులే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రపంచం రెండుగా విడి పోయింది.
గతంలో రష్యా వర్సెస్ యుఎస్ ఉండేది. ఇప్పుడు చైనా వర్సెస్ అమెరికాగా మారి పోయింది.
ఈ తరుణంలో మార్కెట్ పరంగా ఏ దేశమైతే ఆధిపత్యం చెలాయిస్తుందో ఆ దేశం చేతుల్లోనే వనరులు ఉంటున్నాయి.
ఈ క్రమంలో ఈ ఏడాది పాలకుల వైఫల్యం చెందితే , స్వయం సమృద్దిని సాధించకుండా సాగిలపడడం అలవాటు చేసుకుంటే ఎలా దేశం నాశనం
అవుతుందో ప్రత్యక్షంగా యావత్ ప్రపంచం కళ్లారా చూసింది ద్వీప దేశం శ్రీలంకను(Srilanka Protest).
ఈ తరుణంలో భారత్ ఒక్కటే ఆ దేశానికి సంఘీభావం ప్రకటించింది. సంపూర్ణ మద్దతును ఇచ్చింది. ఇదే క్రమంలో అప్పులు ఇచ్చిన చైనా అడగడం
మొదలు పెట్టింది. ఏలిన పాలకులైన గోటబయ రాజపక్సే కుటుంబం పూర్తిగా అవినీతి, అక్రమాలకు పాల్పడింది.
వనరులను సర్వనాశనం చేసింది. ఆపై జనాగ్రహానికి గురై ఏకంగా దేశాధ్యక్షుడిగా ఉన్న గోటబయ ప్రాణ భయంతో పారి పోయాడు. మరో సోదరుడు మహీంద రాజపక్సే ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు.
ఈ తరుణంలో బ్యాంకాక్ కు అక్కడి నుంచి సింగపూర్ కు వెళ్లిన గోటబయ తిరిగి ఎక్కడా చోటు లేక శ్రీలంకకు వచ్చాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత
మధ్య. కానీ దేశాన్ని సర్వ నాశనం చేసి పరువు తీసి. ప్రజల్ని ఆకలి కేకలకు వదిలి వేసిన గోటబయను అరెస్ట్ చేయాలని, శిక్షించాలని డిమాండ్ పెరుగుతోంది.
ఈ రకంగా వేలాది మంది మళ్లీ రోడ్లపైకి వచ్చారు. పాలకులకు సైనికులు రక్షణగా కొంత కాలమే ఉండగలరు. కానీ ప్రజాగ్రహం ముందు ఏదీ పని
చేయదని తెలుసుకోవాలి. ప్రజలే అంతిమంగా చరిత్ర నిర్మాతలని గుర్తించాలి. తస్మాత్ జాగ్రత్త.
Also Read : రాజాపక్సేకు దాక్కునేందుకు చోటు లేదు