SS Thaman : సూప‌ర్ స్టార్ మంచి ఫీల్డ‌ర్ – థ‌మ‌న్

మ‌హేష్ బాబు పై ఆస‌క్తిక‌ర కామెంట్స్

SS Thaman : ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ , ట్రైల‌ర్ దుమ్ము రేపింది. ఇక పాట‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

విడుద‌ల చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తున్నాయి. అభిమానుల‌కు కరోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెంచేలా చేసింది. చిత్రానికి ఎస్. ఎస్. థ‌మ‌న్(SS Thaman) సంగీతం అందించాడు.

 

ఐదు పాట‌ల్ని అనంత శ్రీ‌రామ్ రాశారు. క‌ళావ‌తి సాంగ్ మిలియ‌న్ల వ్యూస్ తో రికార్డ్ బ్రేక్ చేస్తోంది. ఇక స‌ర్కార్ వారి పాట చిత్రం ప్రీ రిలీజ్ ఈవెండ్ వేడుక హైద‌రాబాద్ లోని యూసుఫ్ గూడ‌లో జ‌రిగింది. ప్రిన్స్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.

స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కులు మ‌లినేని గోపీ చంద్, సుకుమార్ , బుచ్చి (ఉప్పెన), వంశీ పైడిప‌ల్లి, మెహ‌ర్ ర‌మేష్ హాజ‌ర‌య్యారు. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వాల‌ని కోరారు.

తాను నేను ఒక్క‌డినే సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా చేశాన‌ని చెప్పాడు ఉప్పెన ద‌ర్శ‌కుడు. అప్ప‌టి దాకా అమ్మాయిలే అందంగా ఉంటార‌ని అనుకునే వాడిన‌ని కానీ సెట్స్ లోకి మ‌హేష బాబు వ‌చ్చాక త‌న అభిప్రాయాన్ని మార్చుకున్నాన‌ని చెప్పాడు.

మ‌గ‌వాళ్లు కూడా అందంగా ఉంటార‌ని అర్థ‌మైంద‌న్నాడు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే థ‌మ‌న్((SS Thaman) ను యాంక‌ర్ సుమ ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న అడిగింది. సినిమా టీం క్రికెట్ టీం అయితే మీరు మ‌హేష్ కు ఏ ప్లేస్ ఇస్తార‌ని అడిగింది.

దీనికి థ‌మ‌న్(SS Thaman) సిల్లీగా ఆన్స‌ర్ ఇచ్చాడు మ‌హేష్ బాబు మంచి ఫీల్డ‌ర్ , కెప్టెన్ గా బెట‌ర్ అని పేర్కొన్నాడు.

 

Also Read : స‌ర్కార్ వారి పాట బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!