SSA Employees Dharna : ఎస్ఎస్ఏ ఉద్యోగుల అరెస్ట్
సమాన పనికి సమాన వేతనం
SSA Employees Dharna : ఓ వైపు బంగారు తెలంగాణ అనుకుంటూ ఆగమాగం చేస్తున్న సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు ఆయా ప్రభుత్వశాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఎంప్లాయిస్. ఇప్పటికే కోట్లాది రూపాయలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సంస్థల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులకు గంప గుత్తగా ప్రజల ఖజానాకు గండి కొట్టిన కేసీఆర్ తమకు మాత్రం అన్యాయం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
SSA Employees Dharna Viral
బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో పని చేస్తున్న వారంతా పెద్ద ఎత్తున రాజధానికి తరలి వచ్చారు. ఎస్ఎస్ఏ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. వేలాదిగా తరలి వచ్చిన వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇప్పటికే పలుమార్లు ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. అయినా సీఎం స్పందించడం లేదు. ప్రభుత్వం పట్టించు కోక పోవడాన్ని తప్పు పట్టారు. తమకు జీతాలు చెల్లించడంలో సైతం ఆలస్యం చేస్తున్నారంటూ వాపోయారు.
తాజాగా సమాన పనికి సమాన వేతనం కావాలన్న డిమాండ్ తో శాంతియుతంగా నిరసన తెలియ చేసిన సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ప్రగతి భవన్ కు రాకుండానే రోజూ రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు నెలకు రూ. 3.36 లక్షల వేతనం తీసుకుంటున్నాడని ఆరోపించారు.
Also Read : Tellam Venktarao : పొంగులేటికి షాక్ ‘తెల్లం’ జంప్