Lata Mangeshkar : స్థిరంగా ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం

పుకార్లు న‌మ్మ‌వ‌ద్ద‌న్న మ‌రాఠా స‌ర్కార్

Lata Mangeshkar : భార‌తీయ సినీ దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం స్థిరంగానే ఉంద‌ని ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె కుటుంబీకులు స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా కొంత వ‌య‌సు పెరిగిన దృష్ట్యా ముందు జాగ్ర‌త్త‌గా ల‌తాజీని (Lata Mangeshkar )ఈనెల ప్రారంభంలో ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్పిట‌ల్ లో చేర్చారు. కోవిడ్ 19 పాజిటివ్ ల‌క్షణాలు కొద్దిగా క‌నిపించ‌డంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు.

త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ వ‌ద్ద‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం కుద‌టగానే ఉంద‌ని తెలిపారు. స‌మ‌ర్థులైన వైద్యులు ఆమెకు వైద్యం అంద‌జేస్తున్నార‌ని పేర్కొన్నారు.

ల‌తా మంగేష్క‌ర్ కు ఇప్పుడు 93 ఏళ్లు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఆమెకు ప్ర‌శాంతంత‌, మెరుగైన వైద్యం అవ‌స‌ర‌మ‌ని మేం భావిస్తున్నాం. ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని కుటుంబీకులు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ల‌తా మంగేష్క‌ర్ (Lata Mangeshkar )వేలాది పాట‌లు పాడారు. హిందీ, మ‌రాఠీ, బెంగాలీతో పాటు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లో సైతం అద్భుత‌మైన పాట‌లు ఆలాపించారు.

ల‌తాజీ అంటే ప్ర‌స్తుత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆమె చెల్లెలు ఆషా భోంస్లే కూడా గొప్ప గాయ‌ని. ల‌తా మంగేష్క‌ర్ చేసిన సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం దేశంలోని అత్యున్న‌త పుర‌స్కారం భార‌త ర‌త్న‌ను అంద‌జేసింది.

అంతే కాకుండా ప‌ద్మ భూష‌ణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు అనేక జాతీయ‌, ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాలు అందుకున్నారు ల‌తా మంగేష్క‌ర్. ఆమె చివ‌రి ఆల్బ‌మ్ 2004లో వీర్ జారా విడుద‌లైంది.

Also Read : స్విస్ టూర్ లో స‌మంత బిజీ

Leave A Reply

Your Email Id will not be published!