Stampede Breaks : క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం తొక్కిసలాట
హైదరాబాద్ లో పలువురికి గాయాలు
Stampede Breaks : భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ కు హైదరాబాద్ సిద్దమైంది. అయితే టికెట్లకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది.
క్రికెట్ అభిమానులు భారీగా టికెట్ల కోసం చేరుకున్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డు ఉంటేనే ఒకరికి ఒక టికెట్ అంటూ నిబంధన పెట్టారు.
టికెట్లు దొరకక అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొందరు తొక్కిసలాటలో(Stampede Breaks) గాయపడ్డారు. వారిని యశోద ఆస్పత్రికి తరలించారు.
టికెట్లు ప్రారంభించిన కొద్ది సేపటికే పరిస్థితి అదుపు తప్పింది. ఉత్సాహంతో ఉన్న వారంతా శాంతి భద్రతకు ముప్పుగా మారారు. ఇక పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.
టికెట్ల అమ్మకాలను జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఆసిస్ మధ్య టి20 జరగనుంది.
ఇప్పటికే సదరు అసోసియేషన్ పనితీరుపై సవాలక్ష ఆరోపణలు ఉన్నాయి. కేసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మాజీ భారత జట్టు కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ ఒంటెద్దు పోకడ వల్లనే ఇలా జరిగిందంటున్నారు మిగతా క్రికెటర్లు.
ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఆరా తీసింది. దీనికి గల కారణాలు ఏమిటనే దానిపై తనకు తెలియ చేయాల్సిందిగా క్రీడా శాఖ మంత్రి విఎస్ గౌడ్ ఆదేశించారు.
మరో వైపు అజహరుద్దీన్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈరోజు వరకు సంస్థ ఉందా లేదో కూడా తెలియడం లేదన్నారు.
Also Read : ముస్లిం నేతలపై అసదుద్దీన్ ఓవైసీ గుస్సా