Statue Of Equality : ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన శ్రీ భగవద్ రామానాజాచార్యుల సమతామూర్తి (Statue Of Equality)అద్భుతాలలో ఇది కూడా ఒకటి అని కొనియాడారు భారత దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
ఇవాళ దర్శించు కోవడంతో తన జన్మ ధన్యమైందన్నారు. లోకంలో ఎనిమిదో అద్భుతమన్నారు. ధర్మ ప్రచారానికి, ఆధ్మాత్మికతకు ఈ మూర్తి ప్రేరణగా నిలుస్తున్నారు.
ఇవాళ ఉప రాష్ట్రపతి శ్రీరామనగరంను సందర్శించారు. ఆయనతో పాటు గవర్నర్ బండార దత్తాత్రేయ, హోం మినిష్టర్ మహమూద్ అలీ, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
వారందరికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమతాకేంద్రంను(Statue Of Equality) సందర్శించారు. 108 దివ్య దేశాలను దర్శించుకున్నారు. శ్రీ రామానుజుడి మార్గాన్ని అనుసరించాలని సూచించారు.
అన్నింటికీ గూగుల్ అనుకుంటున్నారని కానీ దానికి ప్రాబ్లం కూడా వస్తే మరో గురువు (టెక్నికల్ ) అవసరం అవుతారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ఐదు విషయాలు గుర్తించాలని అన్నారు.
తల్లి, గురువు, మాతృ భాష, మాతృ భూమి, దేశాన్ని మరిచి పోకూడదన్నారు. ప్రాంతీయ భాషలు అని పిలవకండి అని అన్నారు. అవి కూడా దేశీయ భాషలేనని చెప్పారు వెంకయ్య నాయుడు.
ప్రతి ఒక్కరు మాతృభాషలో మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. బతుకు దెరువు కోసం ఇతర భాషలను నేర్చు కోవడంలో తప్పు లేదని కానీ తల్లి భాషను మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
వెయ్యేళ్ల కిందట శ్రీ రామానుజుడు సమతామూర్తి సమతను చాటాడని కొనియాడారు. ఆనాడే కుల, మతం, వర్గ విభేదాలను వీడి పామరులకు కూడా దైవం ఉండాలని కోరారన్నారు.
Also Read : రామానుజుడి చెంతకు రాష్ట్రపతి