Steve Smith : ఇప్ప‌ట్లో ఆ ఆలోచ‌న లేదు – స్మిత్

అవ‌న్నీ పుకార్లేన‌న్న స్టార్ క్రికెట‌ర్

Steve Smith : ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌లో మోస్ట్ పాపుల‌ర్ ఆట‌గాడు ఎవ‌రైనా ఉన్నారంటే అత‌డే స్టీవ్ స్మిత్(Steve Smith). చాలా కూల్ గా ఉంటాడు. ఎక్క‌డా తొట్రుపాటుకు గుర‌వడు. కానీ ఒక్క‌సారి మైదానంలోకి వ‌చ్చాడంటే ప‌రుగుల వ‌ర‌ద పారించాల్సిందే. అయితే కొత్త ఆట‌గాళ్లు వ‌స్తుండ‌డంతో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించాడు స్టీవ్ స్మిత్. అవ‌న్నీ పుకార్లేన‌ని, అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని పేర్కొన్నాడు. త‌న‌లో ఇంకా శ‌క్తి ఉంద‌ని, అద్బుతైమ‌న ఫామ్ లో ఉన్నాన‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం తాను క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నాన‌ని, ఇంకా చేరుకోవాల్సిన మైలురాళ్లు చాలా ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. వ్య‌క్తిగ‌త ప‌రుగుల వీరుల‌లో ఒక‌డిగా ఉన్నాడు స్టీవ్ స్మిత్.

తాను ఎక్క‌డికీ వెళ్ల‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. తాను వాటి గురించి ప‌ట్టించుకోన‌ని అన్నాడు. అంతే కాదు క‌ఠినమైన విదేశీ టూర్లు ఉన్నాయి. వాటి మీద తాను ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాన‌ని తెలిపాడు స్టీవ్ స్మిత్(Steve Smith). త‌న‌లో ఇంకా ఆడేందుకు కావాల్సిన శ‌క్తి ఉంద‌న్నాడు. అలాంటప్పుడు తాను ఎందుకు విమ‌ర‌ణ చేస్తానంటూ ప్ర‌శ్నించాడు.

నాకు ఇప్పుడు 33 ఏళ్లు. ఏం వ‌య‌స్సు మించి పోయింద‌ని. ఇప్ప‌టికీ ప‌రుగుల దాహంతో ఉన్నాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు స్టీవ్ స్మిత్. తన‌కు ఆట త‌ప్ప మ‌రొక‌టి తెలియ‌ద‌న్నాడు. ఇదే స‌మ‌యంలో యువ ఆట‌గాళ్ల‌కు సూచ‌న‌లు కూడా ఇస్తున్న‌ట్లు తెలిపాడు.
కాగా స్టీవ్ స్మిత్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : నెట్ ఫ్లిక్స్ సూచ‌న వార్న‌ర్ స్పంద‌న

Leave A Reply

Your Email Id will not be published!