Steve Smith Appoint : త‌ల్లికి అనారోగ్యం కెప్టెన్సీకి దూరం

పాట్ క‌మిన్స్ కు బ‌దులు స్టీవ్ స్మిత్ కెప్టెన్

Steve Smith Appoint : భార‌త్ లో ప‌ర్య‌టిస్తున్న ఆస్ట్రేలియా జ‌ట్టుకు ఈసారి క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టికే నాలుగు టెస్టుల‌లో భాగంగా జ‌రిగిన రెండు టెస్టులలో ఓట‌మి పాలైంది. ఇంకా రెండు టెస్టుల‌తో పాటు మూడు వ‌న్డేలు ఆడాల్సి ఉంది. ఈ త‌రుణంలో ఇప్ప‌టికే గాయాల బారిన ప‌డి నానా తంటాలు ప‌డుతున్నారు ఆసిస్ క్రికెట‌ర్లు. ఉన్న‌ట్టుండి పిడుగు లాంటి వార్త చేరింది ఆసిస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కు. త‌ల్లి ఆరోగ్యం విష‌మంగా ఉంద‌ని వెంట‌నే రావాల్సిందిగా స‌మాచారం అందింది.

దీంతో తాను అందుబాటులో ఉండ‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ధ్రువీక‌రించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌ల్లిని చూసుకునేందుకు పాట్ క‌మిన్స్ ను రావాల్సిందిగా కోరాం. ఆయ‌న బ‌య‌లుదేరాడు.

దీంతో ఆసిస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను మ‌రో సీనియ‌ర్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్(Steve Smith Appoint) చూసుకుంటాడ‌ని తెలిపింది ఆసిస్ బోర్డు. మ‌రో వైపు గ్లెన్ మాక్స్ వెల్ , మిచెల్ మార్ష్ సైతం గాయాల నుండి కోలుకోని చాలా కాలం త‌ర్వాత వ‌న్డే స‌రీస్ కు ఎంపిక‌య్యారు.

మ‌రో వైపు భార‌త జ‌ట్టు రెండు విజ‌యాల‌తో దూకుడు మీద ఉంది. ఎలాగైనా స‌రే ఆసిస్ ను క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త జ‌ట్టు కంక‌ణం క‌ట్టుకుంది. ఇక అటు టెస్టు ఆట‌గాళ్ల‌తో పాటు ఇటు వ‌న్డే కు ఎంపికైన క్రికెట‌ర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండ‌డం ఆసిస్ కు మింగుడు ప‌డ‌డం లేదు. ఈ ఏడాది ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ లో జ‌ర‌గ‌నుంది.

Also Read : హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కంట‌త‌డి

Leave A Reply

Your Email Id will not be published!