Steve Smith : ఆసిస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన రికార్డ్ సృష్టించాడు. మరో మైలు రాయిని సాధించాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తున్నాడు స్మిత్.
అంతే కాకుండా ఊహించని రీతిలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్టీవ్ స్మిత్(Steve Smith) కు వైస్ కెప్టెన్ గా నియమించింది.
గతంలో స్టీవ్ స్మిత్ ఆసిస్ టీమ్ కు స్కిప్పర్ గా కూడా పని చేశాడు.
అన్ని ఫార్మాట్ లలో అద్బుతంగా రాణిస్తూ వచ్చాడు స్మిత్. తాజాగా ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ చరిత్రలో 3 వేల పరుగుల జాబితాలో చేరాడు .
అంతకు ముందు ఇదే టీం నుంచి ఇప్పటి వరకు 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న వారిలో ఐదు మంది ఉన్నారు.
ఇక వివరాలకు వెళితే స్టీవ్ స్మిత్ కంటే ముందు సర్ బ్రాడ్ మెన్ 5 వేల 28 పరుగులు చేశాడు.
హోబ్స్ 3 వేల 636 పరుగులు, అలెన్ బోర్డర్ 3 వేల 222 పరుగులు , స్టీవ్ వా 3 వేల 173, గోవర్ 3 వేల 37 పరుగులు చేశాడు.
ఇదిలా ఉండగా స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ సీరీస్ లో భాగంగా నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగులు ,
రెండో ఇన్నింగ్స్ లో 23 పరుగులతో యాషెస్ సీరీస్ లో 3002 పరుగులు పూర్తి చేశాడు.
ఇదిలా ఉండగా స్టీవ్ స్మిత్(Steve Smith) క్రికెట్ కు సంబంధించిన అన్ని ఫార్మాట్ లలోను అద్బుతంగా రాణించాడు.
అంతే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు.
ఒక్కసారి మైదానంలోకి వచ్చి సెట్ అయితే అద్భుతంగా రాణించే సత్తా స్టీవ్ స్మిత్ కు ఉంది.
ఏ మాత్రం తప్పులు చేయకుండా తన మీద తనకు పట్టు కలిగి ఉండడం ఈ క్రికెటర్ స్పెషల్.
Also Read : సఫారీ టూర్ ద్రవిడ్ కు పెను సవాల్