Shikhar Dhawan Catch : శిఖ‌ర్ ధావ‌న్ స్ట‌న్నింగ్ క్యాచ్

డేవిడ్ వార్న‌ర్ 46 ర‌న్స్ కు ఔట్

Shikhar Dhawan Catch : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ 15 ప‌రుగుల తేడాతో ఓడి పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆరంభం నుంచి అద‌ర‌గొట్టింది. నిర్ణీత 20 ఓవ‌ర్లలో కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 213 ర‌న్స్ చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ మ‌రోసారి రాణించాడు. 46 ర‌న్స్ చేశాడు. పృథ్వీ షా 54 ర‌న్స్ చేస్తే రీల్ రోసౌవ్ దంచి కొట్టాడు. సిక్స‌ర్లు ఫోర్ల‌తో రెచ్చి పోయాడు. 82 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.

ఫుల్ జోష్ లో ఉన్న డేవిడ్ వార్న‌ర్ సిక్స్ కొడ‌దామ‌ని ప్ర‌య‌త్నించాడు. తీరా బంతి స్పీడ్ గా వెళ్లింది. మైదానంలో ఎల్ల‌ప్పుడూ అల‌ర్ట్ గా ఉండే పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టాడు. దీంతో క్రీజులో పాతుకు పోయి హాఫ్ సెంచ‌రీ వైపు దూసుకు వెళుతున్న వార్న‌ర్ మామ‌కు షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో శిఖ‌ర్ ధావ‌న్ ప‌ట్టుకున్న ఈ క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 198 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. శిఖ‌ర్ ధావ‌న్ నిరాశ ప‌రిచాడు. గోల్డెన్ డ‌కౌట్ గా వెనుదిరిగాడు. లియాన్ లివింగ్ స్టోన్ 94 ర‌న్స్ తో రెచ్చి పోయాడు. మొత్తంగా ప్లే ఆఫ్ కు చేరుకోవాల‌ని క‌ల‌లు క‌న్న పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ ప‌డింది. ఇక ధావ‌న్ క్యాచ్ వైర‌ల్ గా మారింది నెట్టింట్లో.

Also Read : SRH vs RCB IPL 2023

Leave A Reply

Your Email Id will not be published!