Delhi Govt : ఢిల్లీ ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇ-సైకిళ్లను ప్రోత్సహిస్తూ వస్తోంది సర్కార్. మొదటిసారిగా 10,000 ఇ-సైకిల్ కొనుగోలుదారులకు ఖుష్ కబర్ చెప్పింది. రూ. 5,500 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ప్యాసింజర్ ఇ- సైకిళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇందులో మొదటి సారిగా 1,000 మంది కూడా అదనపు సబ్సిడీని అందుకుంటారని తెలిపింది. వీరికి రూ. 2,000 ఇస్తామని వెల్లడించింది.
వాణిజ్య అవసరాల కోసం హెవీ డ్యూటీ కార్గో ఈ – సైకిల్స్ , ఈ కార్ట్ ల కొనుగోలుపై సర్కార్ సబ్సిడీ (Delhi Govt )ఇస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో 45 వేల 900 ఈ వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి.
ఈ విషయాన్ని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ వెల్లడించారు. వాణిజ్య అవసరాల కోసం హెవీ డ్యూటీ కార్గో ఈ సైకిల్స్ , ఈ కార్ట్ ల కొనుగోలుపై కూడా సర్కార్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు.
కార్గో ఈ సైకిళ్లపై సబ్సిడీ రూ. మొదటి 5 వేల మంది కొనుగోలుదారులకు ఒక్కొక్కరికి రూ. 15, 000 ఇస్తుందని వెల్లడించారు. సబ్సిడీ గతంలో ఇ కార్ట్ ల వ్యక్తిగత కొనుగోలుదారులకు అందించామన్నారు.
ప్రస్తుతం ఈ వాహనాలను కొనుగోలు చేసే కంపెనీ లేదా కార్పొరేట్ సంస్థ కు రూ. 30 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఢిల్లీకి చెందిన వారికి మాత్రమే ఈ సబ్సిడీ పథకానికి అర్హులని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతున్న వాటిలో 36 శాతం ద్విచక్ర వాహనాలేనని మంత్రి వెల్లడించారు.
Also Read : ఆరోగ్యానికి భరోసా ఆయుష్మాన్ ఆసరా