Harnaz Sandhu Case : మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుపై దావా
ఒప్పందం ఉల్లంఘించిందంటూ ఆరోపణ
Harnaz Sandhu Case : మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేసిందంటూ పంజాబీ సినిమా నిర్మాత ఉపాసన సింగ్ హర్నాజ్ సంధుపై(Harnaz Sandhu Case) కోర్టును ఆశ్రయించింది.
పంజాబీ సినిమా ప్రమోషన్ కోసం ఆమె సంతకం చేసిందని, ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కిందంటూ ఆరోపించారు ఉపాసనా సింగ్. తమ సినిమాకు సంబంధించి కుదుర్చుకున్న అగ్రిమెంట్ కు అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మిస్ యూనివర్స్ గా ఎంపికయ్యాక తమను పట్టించు కోవడం లేదంటూ మండిపడింది. ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా డోంట్ కేర్ అంటూ పేర్కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాసనా సింగ్.
గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పందాన్ని విస్మరించడంపై మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుపై సినీ నిర్మాత ఉపాసన సింగ్ స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఆమె బాయి జీ కుట్టాంగేలో ప్రధాన పాత్ర పోషించింది.
ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ ఉపాసనా సింగ్ చండీగఢ్ జిల్లా కోర్టులో సివిల్ దావా వేశారు. హర్నాజ్ కి బాయి జీ కుట్టంగే చిత్రంలో నటించే అవకాశం ఇచ్చాను. యారా దియన్ పూ బరన్ లో కూడా కథానాయికగా నటించిందన్నారు.
అందుకే పరిహారం కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు సింగ్. 2021 మిస్ యూనివర్స్ కిరీటం కైవసం చేసుకున్న సంధు తన సంతోష్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియో ఎల్ఎల్పీతో ఒప్పందం ప్రకారం సినిమా ప్రమోషన్ చేయాల్సి ఉంది.
సినిమా ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇచ్చేందుకు ఆమె నిరాకరించిందని ఉపాసన సింగ్ ఆరోపించారు.
Also Read : ప్రియాంక చోప్రా బోల్డ్ డ్రెస్ వైరల్