SRH vs RCB IPL 2022 : హైద‌రాబాద్ దెబ్బ బెంగ‌ళూరు అబ్బా

అత్యల్ప స్కోర్ కే చాప చుట్టేసిన డుప్లెసిస్ సేన

SRH vs RCB : ఊహించని రీతిలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ దుమ్ము రేపుతోంది. మొద‌ట్లో త‌డ‌బ‌డినా ఆ త‌ర్వాత అనుకోని రీతిలో రాణిస్తోంది. ప్ర‌త్య‌ర్థుల జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది.

బౌల‌ర్ల ప్రతాపానికి ఠారెత్తి పోతున్నారు బ్యాట‌ర్లు. ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ఐపీఎల్ లో టైటిల్ ఫెవ‌రేట్ గా పేరొందిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ ప‌రిచింది.

స‌న్ రైజ‌ర్స్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో కేవ‌లం 68 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. మొత్తం 14 సీజ‌న్లు జ‌రిగితే 2017లో ఆర్సీపీ 49 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఇప్పుడు ఈ అత్యల్ప స్కోర్ న‌మోదు చేసింది.

ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH vs RCB) బౌల‌ర్లు వికెట్లు తీసేందుకు నువ్వా నేనా అంటూ పోటీ ప‌డ్డారు. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. మొత్తం జ‌ట్టులో ముగ్గురు డ‌కౌట్ అయ్యారు.

అనంత‌రం 69 టార్గెట్ ను ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఆ జ‌ట్టుకు ఇది వ‌రుస‌గా ఐదోసారి విజ‌యం. ముందుగా టాస్ గెలిచిన హైద‌రాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇక బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 18.1 ఓవ‌ర్ల‌లో 68 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సుయాస్ 15 ర‌న్స్ చేస్తే మ్యాక్స్ వెల్ 12 ప‌రుగులు చేయ‌గ‌లిగారు.

అనంత‌రం టార్గెట్ చేద‌న‌లో అభిషేక్ శ‌ర్మ 28మ బంతులు ఆడి 8 ఫోర్లు ఒక సిక్స్ కొట్టి 47 ర‌న్స్ చేశారు. మార్కో జాన్స‌న్ 25 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే న‌ట‌రాజ‌న్ 10 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read : నో బాల్ వ్య‌వ‌హారంపై ఐపీఎల్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!