CSK vs SRH : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ఇవాళ ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్(CSK vs SRH )బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
దీంతో వరుసగా రవీంద్ర జడేజా నాయకత్వంలోని సీఎస్కే నాలుగోసారి అపజయాన్ని మూటగట్టుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH ) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
హైదరాబాద్ జట్టు బౌలర్లు చాలా కట్టుదిట్టగా బౌలింగ్ చేశారు. దీంతో పరుగులు రావడం కష్టంగా మారింది. దీంతో సీఎస్కే తరపున మోయిన్ అలీ అద్భుతంగా ఆడాడు. 48 పరుగులు చేశాడు.
అంబటి రాయుడు 27 పరుగులు చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా చివరలో వచ్చి 22 పరుగులు చేశాడు. దీంతో ఆ మాత్రం స్కోర్ చేసింది సీఎస్కే. అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది.
155 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి వచ్చిన ఎస్ ఆర్ హెచ్ మొదట్లో మెల్లగా ఆడినా ఆ తర్వాత సత్తా చాటింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 32 పరుగులు చేస్తే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 75 పరుగులు చేసి దుమము రేపాడు.
అనంతరం వచ్చిన రాహుల్ త్రిపాఠి సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో శర్మ అవుట్ అయ్యాక వచచిన పూరన్ 5 పరుగులు చేసి నిలిచాడు.
Also Read : చేతులెత్తేసిన చెన్నై హైదరాబాద్ విక్టరీ