SRH vs KKR : ఐపీఎల్ 2022లో టైటిల్ ఫెవరేట్ గా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ (SRH vs KKR )కు కోలుకోలేని షాక్ ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. లీగ్ మ్యాచ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
176 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ కేవలం 17.5 ఓవర్లలోనే కథ ముగించేందుకు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న
రాహుల్ త్రిపాఠి చెలరేగి ఆడాడు. 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న త్రిపాఠి 4 ఫోర్లు 6 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు.
ఇక త్రిపాఠికి ఎయిడెన్ మార్కరమ్ 36 బంతులు ఆడి 6 ఫోర్లు 4 సిక్సర్లతో సత్తా చాటాడు. 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
వీరిద్దరూ కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక కోల్ కతా నైట్ రైడర్స్ (SRH vs KKR )బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేక పోయారు. ఆండ్రీ రసెల్ 2 వికెట్లు తీస్తే పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఇక బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ లో నితీశ్ రాణా 54 పరుగులు చేస్తే , ఆండ్రూ రస్సెల్ 49 , కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేశారు.
ఇక ఎస్ ఆర్ హెచ్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లు తీస్తే , ఉమ్రాన్ మాలిక్ 2, భువనేశ్వర్ కుమార్ , జాన్సన్ ,సుచిత్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా గాడిన పడింది సన్ రైజర్స్ హైదరాబాద్.
Also Read : పాండ్యా కెప్టెన్సీ సింప్లీ సూపర్