KKR vs SRH IPL 2022 : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టార్గెట్ 178

దుమ్ము రేపిన ఆండ్రూ ర‌స్సెల్..బిల్లింగ్స్

KKR vs SRH IPL 2022 : ఐపీఎల్ 2022లో భాగంగా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి 6 వికెట్లు కోల్పోయి 177 ప‌రుగులు చేసింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో ఆండ్రూ ర‌స్సెల్ అద్భుతంగా రాణించాడు.

సామ్ బిల్లింగ్స్ సైతం సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. 34 ప‌రుగులు చేయ‌గా అజింక్యా ర‌హానే 28 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించారు. అంత‌కు ముందు కేకేఆర్(KKR vs SRH) కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కేకేఆర్ మొద‌ట్లోనే త‌డ బ‌డింది. కానీ ర‌హానే రాణే స్కోర్ ను మెల్ల‌గా పెంచే ప్ర‌య‌త్నం చేశారు. కెప్టెన్ అయ్య‌ర్ ఆక‌ట్టుకోలేదు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ పేస‌ర్ జ‌మ్మూ కాశ్మీర్ ఎక్సె ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. సిక్సులు, ఫోర్ల‌తో అల‌రించాడు ర‌స్సెల్. ఇంకో వైపు బిల్లింగ్స్ కూడా తానేమీ తీసిపోనంటూ ఆడాడు. 34 ప‌రుగుల వ‌ద్ద సామ్స్ విలియ‌మ్స‌న్ కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

83 ప‌రుగుల వ‌ద్ద అయ్య‌ర్ 15 ర‌న్స్ చేసి మాలిక్ బౌలింగ్ లో దొరికి పోయాడు. 72 ప‌రుగుల వ‌ద్ద ర‌హానే మాలిక్ బౌలింగ్ లో శ‌శాంక్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 65 ప‌రుగుల వ‌ద్ద కేకేఆర్(KKR vs SRH) త‌న రెండో వికెట్ ను కోల్పోయింది.

26 ప‌రుగులు చేసిన నితీష్ రాణా మాలిక్ బంతికి బోల్తా ప‌డ్డాడు. 17 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తొలి వికెట్ ను కోల్పోయింది.

వెంక‌టేశ్ అయ్య‌ర్ 7 ప‌రుగులు మాత్ర‌మే చేసి జాన్స‌న్ బౌలింగ్ లో అద్భుత‌మైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Also Read : రూ. 11 కోట్ల ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్

Leave A Reply

Your Email Id will not be published!