SRH Jersy : స‌న్ రైజ‌ర్స్ జెర్సీ అదుర్స్

ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డి

SRH Jersy : త్వ‌ర‌లో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ -ఐపీఎల్ నిర్వ‌హించేందుకు స‌క‌ల ఏర్పాట్లు చేస్తోంది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ. ఇందులో భాగంగా 12, 13 తేదీల‌లో మెగా ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు డిసైడ్ అయ్యింది.

బెంగళూరు వేదిక‌గా ఇది కొన‌సాగ‌నుంది. మొత్తం 1124 మంది క్రికెట‌ర్లు వేలం పాట కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఇందులో బీసీసీఐ 590 మందిని ఎంపిక చేసింది. బేస్ రేటు రూ. 2 కోట్ల నుంచి ప్రారంభ‌మైంది.

గ‌త ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లో 5 మంది క‌రోడ్ ప‌తులుగా మిగిలారు. గ‌తంలో ఐపీఎల్ లో 8 జ‌ట్లు పాల్గొన్నాయి.

తాజాగా బీసీసీఐ రెండు ఫ్రాంచైజీలకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఇందులో బీసీసీఐకి భారీ ఎత్తున లాభాలు అందాయి.

ఏకంగా రూ. 1725 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. తాజాగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH Jersy)ఐపీఎల్ 2022 కోసం స‌రికొత్త జెర్సీతో ద‌ర్శ‌న‌మిచ్చింది.

ఈ విష‌యాన్ని స‌ద‌రు జ‌ట్టు యాజ‌మాన్యం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది.

గ‌త సీజ‌న్ లో కోలుకోలేని షాక్ త‌గిలింది ఆ జ‌ట్టుకు. డేవిడ్ వార్న‌ర్ ను వ‌దులుకుంది.

అత‌డి సార‌థ్యంలో ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు. అయినా ప‌క్క‌న పెట్టేసింది.

కెప్టెన్ గా కాకుండా ఆట‌గాడిగా కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ అనుకోని రీతిలో దుబాయి వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపాడు. ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చాడు ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తో జ‌రిగిన సీరీస్ లో త‌న హ‌వా కొన‌సాగించాడు.

వార్న‌ర్ తో పాటు ఆఫ్గాన్ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్ ను కూడా వ‌దులు కోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది క్రీడా లోకాన్ని. ఫ్రాంచైజీకి సంబంధించి హెడ్ కోచ్ గా టామ మూడి, అసిస్టెంట్ కోచ్ గా సైమ‌న్ క‌టిచ్ , బ్యాటింగ్ కోచ్ గా లారా, బౌలింగ్ కోచ్ గా డేల్ స్టెయిన్ , స్పిన్ బౌలింగ్ కోచ్ గా ముర‌ళీధ‌ర‌న్ ను ఎంచుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!