Sunil Gavaskar Rohit Kohli : రోహిత్..కోహ్లీపై సన్నీ కామెంట్స్
టీ20 ఫార్మాట్ లో ఆడటం కష్టమే
Sunil Gavaskar Rohit Kohli : ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న టీ20 ఫార్మాట్ నుంచి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీలను పూర్తిగా పక్కన పెడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రముఖ కామెంటేంటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar).
వన్డే సీరీస్ లో రోహిత్, కోహ్లీలు రాణించినా పక్కన పెట్టడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉంటారా ఉండరా అన్న అనుమానం వ్యక్తం అవుతున్న తరుణంలో సన్నీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గత నవంబర్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ నుండి , శ్రీలంకతో న్యూజిలాండ్ లో భారత్ ఆడిన రెండు టీ20 సీరీస్ లకు ఇద్దరూ దూరమయ్యారు.
ఈనెలాఖరులో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ సీరీస్ కోసం భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాల భవిష్యత్తుపై భారత మాజీ కెప్టెన్ సునల్ గవాస్కర్(Sunil Gavaskar) తన తీర్పు ఇచ్చారు. గత నెలలో స్వదేశంలో శ్రీలంక సీరీస్ కోసం జట్టును ప్రకటించేందుకు ముందు సెలెక్టర్లు స్పెషలిస్ట్ ఎంపికల కోసం చూస్తున్నారని అందు వల్ల కోహ్లీ, రోహిత్ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చని పేర్కొంది.
సెలెక్టర్లు లేదా బోర్డు నుండి అధికారిక ప్రకటన లేనప్పటికీ ట్రెండ్ ఖచ్చితంగా ఆ విధంగానే సాగుతుంది. కొత్త సెలక్షన్ కమిటీ కొత్త ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుకుంటోందని , అందుకే రోహిత్, కోహ్లీ విశ్రాంతి ఇచ్చామని పేర్కొంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఆసిస్ సీరీస్ కు సమయం అవసరమని గవాస్కర్ పేర్కొన్నారు.
Also Read : 100 సెంచరీలు కోహ్లీకి సాధ్యం