Sunil Gavaskar : కార్తీక్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆడాల్సిందే

సంచ‌ల‌న కామెంట్ చేసిన సునీల్ గ‌వాస్క‌ర్

Sunil Gavaskar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గవాస్క‌ర్(Sunil Gavaskar)  షాకింగ్ కామెంట్స్ చేశారు. వెట‌ర‌న్ క్రికెట‌ర్ , ఫినిష‌ర్ గా పేరొందిన వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

స్వ‌దేశంలో ప‌ర్యాట‌క సౌతాఫ్రికా జ‌ట్టుతో జ‌రిగిన నాలుగో టి20 మ్యాచ్ లో దుమ్ము రేపాడు దినేష్ కార్తీక్. షాన్ దార్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. జ‌ట్టుకు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు కార్తీక్.

ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన కామెంట్స్ చేశాడు. అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. స‌ఫారీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

ఈ సంద‌ర్భంగా త్వ‌ర‌లో ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌బోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టులో త‌ప్ప‌నిస‌రిగా దినేష్ కార్తీక్ ను ఎంపిక చేయాల‌ని బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ కు సూచించాడు గ‌వాస్క‌ర్(Sunil Gavaskar) .

ఇలాంటి ఫినిష‌ర్ ఉండ‌డం టీమిండియాకు మేలు చేకూరుస్తుంద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా కెప్టెన్ రిష‌బ్ పంత్ వ‌రుస‌గా చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ ప‌రిచాడు.

ఇక మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగిన భార‌త జ‌ట్టు 12.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 81 ప‌రుగులు ఉన్న స‌మ‌యంలో దినేష్ కార్తీక్ మైదానంలోకి వ‌చ్చాడు.

ఆట తీరును పూర్తిగా మార్చేశాడు. కేవ‌లం 27 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న కార్తీక్ 55 పరుగులు చేశాడు. దీంతో భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 169 ప‌రుగులు చేసింది. పాండ్యా కూడా దంచి కొట్టాడు.

ప్ర‌స్తుతం గ‌వాస్క‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : జోస్ బ‌ట్ల‌ర్ సునామీ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!