Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ -2022 (IPL) రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఓడి పోవడంపై స్పందించాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన సీఎస్కే (CSK) 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ప్రధానంగా శివమ్ దూబే, మాజీ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మాత్రమే ఆడారు. ఆ తర్వాత ఎవరూ గట్టి పోటీని ఇవ్వలేక పోయారు. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు గవాస్కర్ (Gavaskar) .
ధాటిగా ఆడడంలో కొంత ఫోకస్ పెట్టలేక పోయాడని పేర్కొన్నాడు. ధోనీ తన సహజ సిద్దమైన ఆట తీరును ప్రదర్శించ లేదని తెలిపాడు. ఒకవేళ క్రీజులో ఉండి ఉంటే సీన్ వేరేగా ఉండేదన్నాడు.
ఇదిలా ఉండగా పంజాబ్ కింగ్స్ బౌలర్లు చుక్కలు చూపించారు సీఎస్కేకు. ధోనీకి (Dhoni) బదులు సారథ్య బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచాడు.
విచిత్రం ఏమిటంటే దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ (IPL) 14వ సీజన్ లో అనూహ్యంగా జట్టును ఫైనల్ కు చేర్చటమే కాదు కప్ కూడా తీసుకు వచ్చాడు ధోనీ. మరి ఎందుకు అలా ఆడాడో తనకు తెలియడం లేదన్నాడు గవాస్కర్(Sunil Gavaskar ).
బహుశా ఆ జట్టుపై వత్తిడి ఎక్కువగా ఉందని అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం మూడు మ్యాచ్ లలో వరుసగా హ్యాట్రిక్ ఓటమిని మూట గట్టుకుంది సీఎస్కే.
Also Read : క్రికెట్ కు రాస్ టేలర్ గుడ్ బై