భారత క్రికెట్ జట్టులో మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ , సునీల్ మనోహర్ గవాస్కర్ ఇద్దరూ క్రికెట్ దిగ్గాలు. ప్రపంచ క్రికెట్ లో రికార్డులు నమోదు చేశారు. కెప్టెన్లుగా తమదైన ముద్ర కనబర్చారు. ప్రస్తుతం జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇక సునీల్ గవాస్కర్ ప్రపంచంలో టాప్ కామెంటేటర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. ఈ ఇద్దరూ క్రికెట్ రంగాన్ని ఏలుతున్నారు. ఇక ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కోట్లాది మంది ఆయనను ఆరాధిస్తారు. ప్రేమిస్తారు. సంతకాల కోసం, సెల్ఫీల కోసం ఎగబడతారు.
విచిత్రం ఏమిటంటే తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది చెన్నై లోని చెపాక్ స్టేడియంలో. కామెంటేటర్ స్థానంలో ఉన్న సునీల్ మనోహర్ గవాస్కర్ మ్యాచ్ ముగిశాక మైదానంలోకి వచ్చాడు. పరుగులు తీసుకుంటూ ధోనీ ఉన్న వద్దకు వెళ్లాడు. స్టేడియం మొత్తం , కెమెరాలన్నీ అటు వైపు మళ్లాయి. ఏం జరుగుతుందోనని. ఊహించని విధంగా తన షర్ట్ ను చూపించాడు ఎంఎస్ ధోనీకి.
తన షర్ట్ పై ధోనీ సంతకం చేయమని కోరాడు. క్రికెట్ ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేసింది. ధోనీ సంతకం చేస్తున్న ఫోటో , వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఎంతైనా జార్ఖండ్ డైనమెట్ రియల్లీ గ్రేట్ ప్లేయర్ అని చెప్పక తప్పదు. ఇది క్రీడా స్పూర్తిని చాటుతుందని చెప్పక తప్పదు.