Sunil Gavaskar : టీమిండియా ఓట‌మి ఓ పీడ‌క‌ల

స‌న్నీ గ‌వాస్క‌ర్ కీల‌క కామెంట్స్

Sunil Gavaskar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేంట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaska)rసంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ద‌క్షిణాఫ్రికా టూర్ లో భాగంగా జ‌రిగిన మూడు టెస్టుల సీరీస్ లో టీమిండియా 1-2 తేడాతో టెస్టు సీరీస్ కోల్పోయింది.

సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టులో భార‌త జ‌ట్టు 113 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక జోహెన్న‌స్ బ‌ర్గ్ తో పాటు కేప్ టౌన్ లో జ‌రిగిన రెండో, మూడో టెస్టుల్లో వ‌రుస‌గా స‌ఫారీ టీమ్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ ఎల్గ‌ర్ కీల‌క పాత్ర పోషిస్తే మూడో టెస్టులో కీగ‌న్ పీట‌ర్స‌న్ దుమ్ము రేపారు. త‌మ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. ఈ త‌రుణంలో అన్ని విభాగాల‌లో భార‌త్ చేతులెత్తేసింది.

భార‌త బౌల‌ర్లు ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ లేక పోయారు. ఇక భార‌త బ్యాట‌ర్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మూడో టెస్టులో రిష‌బ్ పంత్ గ‌నుక సెంచ‌రీ చేయ‌క పోయి ఉండి ఉంటే టీమిండియా 100 ప‌రుగుల లోపే స్కోర్ ఉండేది.

ఇక కెప్టెన్ కోహ్లీ సైతం తీవ్ర నిరాశ‌కు గురి చేశాడు. అత‌ను కూడా ఇటీవ‌ల ఎలాంటి ప్ర‌ద‌ర్శన లేకుండానే ఆడ‌టం కొంత ఇబ్బందిక‌రంగా మారింది.

విచిత్రం ఏమిటంటే టీ20, వ‌న్డే జ‌ట్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం కోహ్లీపై ఎక్కువ ప్ర‌భావం చూపిన‌ట్లు ఉంది. ఈ త‌రుణంలో స‌న్నీ(Sunil Gavaskar) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

మొద‌టి టెస్టు గెలిచాక సీరీస్ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉండేదని కానీ చివ‌ర‌కు ఆ క‌ల కూడా పీడ క‌ల‌గా మారింద‌న్నాడు.

Also Read : 21న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్

Leave A Reply

Your Email Id will not be published!