Sunil Gavaskar : దిలీప్..అజ్జూ కామెంట్స్ పై సన్నీ ఫైర్
జట్టు కూర్పుపై విమర్శలు చేయొద్దు
Sunil Gavaskar : ఆస్ట్రేలియాలో త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టు ఎంపిక సరిగా లేదంటూ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు దిలీప్ వెంగ్ సర్కార్, మహ్మద్ అజహరుద్దీన్ సీరియస్ కామెంట్స్ చేశారు.
పూర్తిగా సక్రమంగా లేదంటూ పేర్కొన్నారు. సలహాలు ఇవ్వాలే కానీ విమర్శలు చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదన్నారు మాజీ కెప్టెన్ సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar).
అనుభం కలిగిన ప్లేయర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆడే ఆటగాళ్ల మనో స్థైర్యం దెబ్బ తింటుందన్నారు. జట్టు ప్రకటించిన ప్రతిసారీ విమర్శలు ఎదుర్కోవడం సహజమన్నారు.
ప్రధాన జట్టు నుండి శ్రేయాస్ అయ్యర్, షమీని తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు అజహరుద్దీన్. దీపక్ హుడాకు బదులు అయ్యర్, పటేల్ స్థానంలో షమీని ప్రిఫెర్ చేస్తానని పేర్కొన్నాడు.
తాను గనుక సెలెక్టర్ గనుక ఉంటే షమీ, ఉమ్రాన్ మాలిక్ , శుభమన్ గిల్ లను ఎంపిక చేసి ఉండేవాడినని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఒకసారి టీంను ఎంపిక చేసిన తర్వాత బలహీనతలను ఎత్తి చూపడం కంటే జట్టుకు మద్దతు ఇవ్వాలని సూచించాడు సునీల్ మనోహర్ గవాస్కర్. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టు బలంగా, సమర్థంగా ఉందన్నారు.
తనకు పూర్తి నమ్మకం ఉందని టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవడం ఖాయమన్నాడు సన్నీ. ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ లో వంద శాతం బాగుందని కితాబు ఇచ్చాడు గవాస్కర్.
Also Read : భారత-ఎ జట్టుకు సంజూనే సారథి