Gavaskar Samson : సంజూ శాంసన్ పై సన్నీ సీరియస్
బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై ఫైర్
Gavaskar Samson : ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్(Gavaskar Samson).
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ లో సత్తా చాటిన శాంసన్ ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న 2022 ఐపీఎల్ లో దారుణమైన, చెత్త ప్రదర్శన చేస్తున్న కెప్టెన్ పై మండిపడ్డారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఘోరంగా ఓటమి పాలైంది. 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. విచిత్రం ఏమిటంటే నెంబర్ 2 లేదా 3వ స్థానంలో రావాల్సిన సంజూ శాంసన్ 5వ ప్లేస్ లో రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సునీల్ గవాస్కర్.
నోర్జే అద్భుతమైన బంతికి కెప్టెన్ పెవిలియన్ దారి పట్టాడు. కేవలం 6 పరుగులకే అవుట్ అయ్యాడు. బాధ్యత కలిగిన నాయకుడిగా ఉంటూ ఇలాంటి చెత్త షాట్ తో వెనుదిరగడం పూర్తిగా బాధ్యతా రాహిత్యమేనంటూ మండిపడ్డాడు గవాస్కర్(Gavaskar Samson).
రవిచంద్రన్ అశ్విన్ 50 రన్స్ చేస్తే దేవదత్ పడిక్కల్ 48 పరుగులు చేసి రాణించాడు. జోస్ బట్లర్ ను చేతన్ సకారియా అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు.
వేగవంతమైన , స్థిరమైన ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు ఈ ఐపీఎల్ లో లేవు. సంజూ శాంసన్ స్టార్ హిట్టర్. ఇందులో సందేహం లేదు. విచిత్రం ఏమిటంటే తరుచూ బ్యాటింగ్ ఆర్డర్ లు మారడం వల్ల ఫలితం మారదన్నారు.
నంబర్ 3వ స్థానంలో లేదా 4వ ప్లేస్ లో రావాలని సూచించాడు గవాస్కర్. ఇంతటి కీలకమైన మ్యాచ్ లో ఇలాంటి చెత్త నిర్ణయం కెప్టెన్ తీసుకోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read : పుజారా పునరాగమనంపై సన్నీ కామెంట్