Sunil Gavaskar : రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే బెటర్
సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Sunil Gavaskar : ఐపీఎల్ 16వ సీజన్ లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో హిట్ మ్యాన్ ,ముంబై ఇండియన్స్ స్కిప్పర్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సార్లు గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు.
తాజాగా చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లకే 139 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 140 రన్స్ తో సత్తా చాటింది.
ఈసారి కూడా రోహిత్ శర్మ నిరాశ పర్చాడు. దీంతో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశాడు హిట్ మ్యాన్ పై. ప్రస్తుతం కెప్టెన్ గా రాణించినా వ్యక్తిగతంగా రోహిత్ శర్మ ఆట తీరు బాగోలేదు.
రోహిత్ శర్మ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే భారత్ లో ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. కావాలంటే చివర్లో తిరిగి ఆడినా పర్వా లేదన్నాడు. వెంటనే బ్రేక్ తీసుకుంటే రోహిత్ శర్మకు(Rohit Sharma) బారత జట్టుకు చాలా మేలు అని సూచించాడు గవాస్కర్.
Also Read : 16 సార్లు డకౌట్..రోహిత్ చెత్త రికార్డ్