Super Star Krishna : నిర్మాత‌ల హీరో సూపర్ స్టార్ కృష్ణ

నిజ‌మైన స్నేహ పాత్రుడు

Super Star Krishna : తెలుగు సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చిన న‌టుడు ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ‌(Super Star Krishna). భేష‌జాలు లేనటువంటి అరుదైన వ్య‌క్తి. ఎల్లప్పుడూ సానుకూల దృక్ప‌థంతో ఉన్నారు. నిర్మాత‌ల‌కు ఆయ‌న ప్రాణ‌ప్ర‌ద‌మైన న‌టుడిగా పేరు పొందారు. ఏ సినిమా అయినా ఆడ‌క పోతే మ‌ళ్లీ ఆ నిర్మాత‌కు భ‌రోసా ఇచ్చేవారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) తిరిగి వ‌స్తార‌ని అనుకున్నారు. కౌబాయ్ గా, జేమ్స్ బాండ్ గా , అంద‌మైన రూపానికి పెట్టింది పేరు. వెండితెర స్థాయిని మ‌రింత పెంచిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే. స్నేహ పాత్రుడు, ప్ర‌యోగాల‌కు తెర తీసింది కూడా ఆయ‌నే. సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ పై ప‌ట్టు క‌లిగి ఉన్నారు.

ఒక సామాన్యుడిగా త‌న జీవితాన్ని ప్రారంభించిన ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ శ‌క్తిగా, ప‌రిశ్ర‌మ‌గా ఎదిగాడు. త‌న 57 ఏళ్ల సినీ కెరీర్ లో 350కి పైగా సినిమాలు తీసిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే. గ్రామీణ వాతావ‌ర‌ణం నేప‌థ్యంగా సినిమాలు తీశారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు.

స్వ‌శ‌క్తితో ఎదిగారు. కొత్త ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుడుతూ వెండి తెర‌కు ప్రాణం పోశాడు. ఒక వ్య‌క్తి ఇన్ని రంగాల‌లో ముద్ర క‌న‌బ‌ర్చ‌డం మామూలు విష‌యం కాదు. సింహాస‌నం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మొద‌టిసారిగా 70 ఎంఎంని ప‌రిచ‌యం చేశారు. ప‌ద్మాల‌య స్టూడియో నిర్మాత‌ల‌కు క‌ల్ప‌వృక్షం అని పేరుంది.

వేలాది మందికి ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్షంగా జీవితాల‌ను ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభ‌న్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ లాంటి దిగ్గ‌జాల‌ను కోల్పోయింది సినిమా రంగం. ప‌రిశ్ర‌మ‌లో త‌న భార్య విజ‌య నిర్మ‌ల‌కు స‌హ‌కారం అందించారు. ఆమె చాలా సినిమాలు తీశారు.

Also Read : వెండి తెర‌పై కృష్ణ చెర‌గ‌ని ముద్ర‌

Leave A Reply

Your Email Id will not be published!