Superstar Krishna : వెండి తెరపై కృష్ణ చెరగని ముద్ర
57 ఏళ్ల కెరీర్ లో ఎన్నో విజయాలు
Superstar Krishna : తెలుగు సినిమా రంగం సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna) కన్నుమూతతో శోక సంద్రంలో మునిగి పోయింది. ఆయనను కోల్పోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో విషాదం అలుముకుంది.
ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుతో ఎలాంటి భేషజాలు ప్రదర్శించకుండా సామాన్యమైన వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు కృష్ణ. అందుకే ఆయనను సూపర్ స్టార్ అని పిలుచుకున్నారు. నటుడిగా అందనంత ఎత్తుకు ఎదిగారు.
సినిమా రంగంలో కృష్ణ చేసినన్ని ప్రయోగాలు ఇంకే నటుడు చేయలేదు. ఇది ఆయనకు ఉన్న ప్రత్యేకత. విలక్షణమైన నటనకు పెట్టింది పేరు. తన 80 ఏళ్ల జీవిత కాలంలో 57 ఏళ్ల పాటు సినిమా రంగంలోనే జీవితమంతా గడిపారు.
ఆయన చేయని ప్రయోగాలంటూ ఏవీ లేవు. మూస ధోరణిలో కొనసాగుతున్న తెలుగు సినిమాకు కొత్త సొబగులు అద్దారు కృష్ణ. 350కి పైగా చిత్రాల్లో నటించారు.
ప్రయోగాలకు సంబంధించి హీరోగా కీర్తిస్తారు. సాహసాలకు పెట్టింది పేరుగా గుర్తిస్తారు నటశేఖరుడు కృష్ణను. సినిమా రంగం అంటేనే 24 క్రాఫ్ట్స్ . వీటిపై ఆయనకు మంచి పట్టుంది.
ఏది కొత్తగా అనిపించినా సినిమా రంగానికి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. వెండి తెరకు సమున్నత స్థానం కల్పించేలా ప్రయత్నించారు.
ఘట్టమనేని శివరామ కృష్ణ మరణంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కృష్ణ నటుడే కాదు దర్శకుడు, నిర్మాత అంతకు మించి స్నేహశీలి. నిర్మాతల పాలిట కల్పవృక్షం కూడా. మంచి మనసు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna).
ఇప్పుడు కాదు గత 50 ఏళ్ల కిందటే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించిన ఘనత కూడా ఆయనదే. ఆనాడు బాలీవుడ్ ను కూడా షేక్ చేసేలా చేశారు కృష్ణ. జేమ్స్ బాండ్, కౌబాయ్ , 70 ఎమ్ఎమ్ , ఈస్ట్ మన్ కలర్ లను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసింది కూడా కృష్ణనే. దేశంలో మొదటి కౌబాయ్ చిత్రాన్ని కూడా తీసింది సూపర్ స్టారే.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు