Supreme Court Collegium : 7 రాష్ట్రాలలో న్యాయమూర్తుల బదిలీ
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
Supreme Court Collegium : భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏపీ, తెలంగాణతో సహా 7 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు జస్టిస్ లను బదిలీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం(Supreme Court Collegium) చేసిన సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బొంబాయి, గుజరాత్ , ఒడిశా, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం సమావేశమై కొత్త వారిని ఎంపిక చేసింది.
బదిలీలకు సంబంధించిన జాబితాను పరిశీలిన నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సునీతా అగర్వాల్ ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు సీజేఐ. ఇక అలహాబాద్ హైకోర్టులో ఇప్పటి దాకా పని చేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ముంబై హైకోర్టుకు సిఫారసు చేశారు.
కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్న అలోక్ ఆరదే ను తెలంగాణ హైకోర్టులో నియమించింది. ముంబై హైకోర్టు జడ్జీగా ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఢిల్లీ కోర్టులో ఉన్న జస్టిస్ సిద్దార్థ్ మృదుల్ ను మణిపూర్ హైకోర్టుకు మార్చింది. ఒడిశా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుభాసిష్ తలపత్ర, ఆశిష్ దేశాయ్ ను కేరళ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్.
Also Read : PM Modi : మహనీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ