Justice Alok Aradhe : తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్ ఆరాధే
ఏడు రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులు
Justice Alok Aradhe : సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సారథ్యంలోని భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏడు రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించింది. పలువురిని బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి దాకా కర్ణాటక హైకోర్టు జడ్జీగా ఉన్న అలోక్ ఆరాధే(Alok Aradhe)ను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది. కొలీజియం కేంద్ర సర్కార్ కు జాబితాను సమర్పించింది. ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు ఇప్పటి దాకా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కు పదోన్నతి కల్పించింది. ఆయనను సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది కొలీజియం.
కాగా జస్టిస్ అలోక్ ఆరాధే డిసెంబర్ 29, 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2018 నవంబర్ నుండి కర్నాటక హైకోర్టు జడ్జీగా పని చేస్తున్నారు. న్యాయ పరంగా జడ్జీగా 13 ఏళ్ల అనుభవం ఉంది అలోక్ ఆరాధే. తెలంగాణ, ఏపీతో పాటు బొంబాయి, గుజరాత్, ఒడిశా,కేరళ హైకోర్టులకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.
Also Read : Supreme Court Collegium : 7 రాష్ట్రాలలో న్యాయమూర్తుల బదిలీ
