న్యాయం కావాలంటే పోరాటం చేయాల్సిందే. బతకడం ఎంత గగనమో..నరకమో అంతకంటే ఎక్కువగా స్వేచ్ఛ కోసం నిత్యం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా భావిస్తూ వస్తున్న భారత దేశంలో న్యాయం ఎండమావిగా మారింది. ఈ తరుణంలో ఇంకా న్యాయం బతికే ఉందని నిరూపిస్తున్నారు సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ప్రపంచంలోనే అత్యుత్తమమైన న్యాయమూర్తులలో ఆయన కూడా ఒకరు. బహుషా ఇచ్చే తీర్పులు, వెలిబుచ్చే అభిప్రాయాలు, వ్యక్తం చేసే ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వాటి వెనుక నిగూఢార్థాలు కూడా ఉంటాయి. బహుషా సీజేఐ కొలువు తీరాక కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ కాషాయ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.
అడుగడుగునా అడ్డంకిగా మారడంతో చివరకు వాట్సాప్ యూనివర్శిటీ జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ ను కూడా తూలనాడుతూ పోస్టులు పెట్టారు. ఆపై మీమ్స్ తో హోరెత్తించారు. దీనిపై గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎక్కడా పల్లెత్తు మాట కూడా అనలేదు. అంతే కాదు ఎవరి అభిప్రాయాలు వారివి. విమర్శించే, ఆరోపణలు చేసే, స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హక్కు ఉంది. దానిని నేను ఎలా కాదంటానంటూ ప్రశ్నించారు. ఇది నిజమైన న్యాయ వ్యవస్థకు ఓ తార్కానం..నిదర్శనం కూడా. ప్రస్తుతం సీజేఐ కంట్లో నలుసుగా మారారు. ఆయన టేకోవర్ చేసిన కేసులు, వెలువరిస్తున్న తీర్పులు కలకలం రేపుతున్నాయి. కాషాయ శిబిరంలో కాకా పుట్టిస్తోంది.
తాజాగా మే 11న గురువారం రెండు సంచలానాత్మక తీర్పులు వెలువరించారు సీజేఐ జస్టిస్ ధనంజయ్ చంద్రచూడ్ సారథ్యంలోని న్యాయమూర్తుల ధర్మాసనం. కేంద్రానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు. ఢిల్లీ, కేంద్రానికి మధ్య ఎవరికి ఏయే అధికారాలు ఉంటాయనే దానిపై సంచలన తీర్పు వెలువరించారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని, కేంద్రానికి కేవలం శాంతి భద్రతలు, భూ వ్యవహారాలు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చే తీర్పు అని చెప్పక తప్పదు.
మరో తీర్పు కేంద్ర సర్కార్ కు ప్రధానంగా బీజేపీకి చెంప పెట్టు లాంటిది. మహారాష్ట్ర సర్కార్ సంక్షోభానికి సంబంధించిన కేసు విషయంలో అంతిమ తీర్పు వెలువరించింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుండా ఉండాల్సింది అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఠాక్రేను తిరిగి నియమించలేమని పేర్కొంది. షిండే సీఎంగా కొనసాగించవచ్చు..కానీ తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడింది. ఈ సంక్షోభం నెలకొన్న తరుణంలో అత్యంత బాధ్యతగా వెలువరించాల్సిన మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చట్ట విరుద్దంగా ప్రవర్తించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని తప్పు పట్టింది. పార్టీ మాత్రమే విప్ లను నియమిస్తుందని పేర్కొంది. అయితే గవర్నర్ , స్పీకర్ వ్యవహారం అత్యంత బాధాకరమని ధర్మాసనం మండిపడింది. మొత్తంగా ఈ రెండు చారిత్రాత్మక తీర్పులు అని చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన గవర్నర్ గీత దాటితే ఎలా .
