Supreme Court : కంగ‌నా పోస్టుల సెన్సార్ కు ఒప్పుకోం

స్ప‌ష్టం చేసిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం

Supreme Court  : భార‌తీయ వివాదాస్ప‌ద న‌టిగా పేరొందారు కంగ‌నా ర‌నౌత్. ఆమె మోదీ స‌ర్కార్ కు వ‌త్తాసు ప‌లుకుతూ వివాదాస్ప వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు.

తాజాగా కంగ‌నా ర‌నౌత్ సోష‌ల్ మీడియా పోస్టుల‌ను సెన్సార్ చేసేందుకు భార‌త స‌ర్వోన్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court )నిరాక‌రించింది. సిక్కు రైతుల‌ను ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదులుగా పేర్కొంటూ ఇన్ స్టా వేదిక‌గా పోస్టు చేసింది.

కంగనా వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఫిర్యాదులు న‌మోద‌య్యాయి. సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టుల‌ను సెన్సార్ చేయ‌మంటూ న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు.

పిటిష‌న‌ర్ స్వ‌యంగా ఫిర్యాదు కూడా దాఖ‌లు చేశార‌ని, అందుబాటులో ఉన్న ఇత‌ర చ‌ట్ట ప‌ర‌మైన ప‌రిష్కారాల‌ను కోరుకునే స్వేచ్చ ఉంద‌ని జ‌స్టిస్ చంద్ర‌చూడ్ స్ప‌ష్టం చేశారు.

సిక్కు రైతులు ఖ‌లీస్తానీ ఉగ్ర‌వాదులు. 1984 నాటి మార‌ణ హోమాన్ని స‌మ‌ర్థించారు. అంటే సిక్కుల‌ను అవాంఛ‌నీయ వ్య‌క్తులుగా, త‌క్కువ జాతిగా ప‌రిగ‌ణించాలంటూ , వారికి ఇందిరా గాంధీ వంటి గురువు అవ‌స‌రం అంటూ పోస్ట్ చేసింది కంగ‌నా ర‌నౌత్.

పిటిష‌నర్ చంద‌ర్ జిత్ సింగ్ చంద‌ర్ పాల్ తాను రైతుల నిర‌స‌న‌లో ఉన్నానని కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండ‌గా కంగ‌నా ర‌నౌత్ ప‌దే ప‌దే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ పిటిష‌న్ పై న్యాయ‌మూర్తులు చంద్ర‌చూడ్, బేల ఎం త్రివేదిల‌తో కూడిన ధ‌ర్మాసనం చేపట్టింది. కంగ‌నా ర‌నౌత్ స్టేట్ మెంట్ ల‌ను చ‌ద‌వ వ‌ద్దంటూ పిటిష‌న‌ర్ కు కోర్టు(Supreme Court )సూచించింది.

మీరు ఆమె గురించి ఎంత ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తే మీరు ఆమె ప్ర‌యోజ‌నాల‌కు మేలు చేకూర్చిన వార‌వ‌తారని పేర్కొంది.

Also Read : ఆద‌రించారు విజ‌యం అందించారు

Leave A Reply

Your Email Id will not be published!