Supreme Court Reject : విపక్షాలకు షాక్ పిటిషన్ తిరస్కరణ
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court Reject : భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం కోలుకోలేని షాక్ ఇచ్చింది విపక్షాలకు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ 14 పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court Reject) నిరాకరించింది. ప్రతిపక్ష నాయకులు, ఇతర పౌరులపై అసమ్మతి హక్కును వినియోగించు కోవడంపై బలవంతపు నేర ప్రక్రియల వినియోగంలో భయంకరమైన పెరుగుదల ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలను ఏకపక్షంగా అరెస్ట్ చేశాయని, అరెస్ట్ , రిమాండ్ కు సంబంధించి తాజా మార్గదర్శకాలను కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 14 పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించేది లేదంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు వాస్తవాలతో సంబంధం లేకుండా సాధారణ మార్గదర్శకాలను రూపొందించడం ప్రమాదకరమని వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉండగా సామూహిక అరెస్ట్ లు ప్రజాస్వామ్యానికి ముప్పు అని నిరంకుశత్వానికి నిదర్శనమని పిటిషనర్ల తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. దీనికి సీజేఐ సీరియస్ గా స్పందించారు. ప్రతిపక్షానికి స్థలం తగ్గి పోయిందని మీరు భావిస్తే పరిష్కారం ఆ ప్రదేశంలోనే ఉందని, ఇది రాజకీయాలకు స్థలం కాదని కోర్టు అని గుర్తుంచు కోవాలన్నారు.
కాగా ఈ పిటిషన్ ను దాఖలు చేసిన పార్టీలు కాంగ్రెస్ తో పాటు డీఎంకే, ఆర్జేడీ, బీఆర్ఎస్ , టీఎంసీ, ఆప్ , ఎన్సీపీ, శివసేన యుబీటీ, జేఎంఎం, జేడీయూ, సీపీఎం , సీపీఐ, సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి.
Also Read : అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు