Supreme Court : భారత దేశం యావత్ ఉలిక్కి పడేలా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం(Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఇది ఒక రకంగా ఈ దేశంలో న్యాయం బతికే ఉందని స్పష్టం చేసింది.
యూపీలోని లఖింపూరి ఖేరి ఘటనలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.
వారం రోజుల్లో జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల యూపీ ఎన్నికల కంటే ముందే ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీనిని సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమపై దాడులకు దిగే చాన్స్ ఉందంటూ వాపోయారు.
ఇరు వాదానలు విన్నది జస్టిస్ భారత దేశ సర్వోన్నత న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును ఈనెల 4న రిజర్వ్ లో ఉంచింది.
సోమవారం ఈ కేసుపై కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాధితులకు వినిపించే హక్కు నిరాకరించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సంబంధం లేని పరిశీలన ఆధారంగా ఉందని అభిప్రాయ పడింది.
ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉందని ఈ తీర్పు ద్వారా తెలుస్తుందని బాధితులు తెలిపారు. ప్రతి విచారణలోనూ బాధితులకు తమ వాదన వినిపించే హక్కు ఉంది.
ప్రస్తుత కేసులో సమర్థవంతమైన విచారణకు బాధితులకు అవకాశం నిరాకరించబడిందని తాము భావిస్తున్నట్లు ధర్మాసనం అభిప్రాయపడింది.
Also Read : కశ్మీర్ యూనివర్శిటీ పీహెచ్‌డి స్కాలర్ అరెస్ట్