Supreme Court : ద్వేష పూరిత ప్రసంగంకు సంబంధించి నమోదైన కేసులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ పోలీసులపై సీరియస్ అయ్యింది. సమర్పించిన అఫిడవిట్ పై ఫైర్ అయ్యింది.
గత ఏడాది 2021 డిసెంబర్ 19న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ధర్మ సంసద్ లో ఎలాంటి ద్వేష పూరిత ప్రసంగాలు చేయలేదని , అఫిడవిట్ ను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని పోలీసులు సుప్రీంకోర్టు ముందు అంగీకరించారు.
మరింత మెరుగైన అఫిడవిట్ ను దాఖలు చేస్తామని కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో ఢిల్లీ పోలీసుల ప్రకటనపై సుప్రీంకోర్టు(Supreme Court )తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా ఢిల్లీలోని హిందూ యువ వాహిని కార్యక్రమంలో భాగంగా హిందూ రాష్ట్రం కోసం పిలుపునిచ్చిన ప్రసంగం ద్వేష పూరిత ప్రసంగం కాదంటూ ఢిల్లీ పోలీసులు పేర్కొనడంపై తప్పు పట్టింది.
ఇదే విషయాన్ని గత వారం కోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరింత మెరుగైన అఫిడవిట్ ను సమర్పించాలని ఆదేశించింది.
ఈ ప్రసంగంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. మనం పోరాడుదాం. అవసరమైతే చని పోదాం అంటూ పిలుపునిచ్చారు.
హిందూ యువ వాహిని రైట్ వింగ్ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఢిల్లీ పోలీసుల అఫిడవిట్ పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధ్వజమెత్తారు.
ఈ అపిడవిట్ ను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు దాఖలు చేశారు. ఈ స్టాండ్ ను ఆమోదిస్తారా అంటూ నిలదీశారు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్. తాజాగా మే 4 లోగా పోలీసులు అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఆదేశించారు.
Also Read : తగ్గని పేదరికం తప్పని ద్రవ్యోల్బణం