Wasim Akram : సూర్యా భాయ్ మోస్ట్ డేంజరస్ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్
Wasim Akram : యూఏఈ వేదికగా మరో మెగా టోర్నీ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ బిగ్గెస్ట్ టోర్నీ కోసం కోట్లాది కళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మాజీ క్రికెటర్లు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు.
ఇదే వేదికపై గత ఏడాది 2021లో టి20 వరల్డ్ కప్ లో అనూహ్యంగా భారత జట్టు పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత జట్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.
కానీ అదే రీతిన పాకిస్తాన్ లో కూడా సంబురాలు మిన్నంటాయి. సెప్టెంబర్ 17 దాకా కొనసాగనుంది ఈ టోర్నీ. పేరుకే ఆసియా కప్ అయినా ప్రధానంగా దాయాది దేశాల మధ్య జరిగే మ్యాచ్ కోసం కళ్లు ఎదురు చూస్తున్నాయి.
భారత, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా గత కొన్నేళ్లుగా ఇరు జట్లు తలపడడం లేదు ఆయా దేశాలలో. కానీ కేవలం తటస్థ వేదికలలో మాత్రమే ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి.
ఈ సందర్భంగా ఇరు జట్ల మధ్య ఎవరు పోటీదారుగా ఉంటారనే దానిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్(Wasim Akram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ జట్టు జాగ్రత్తగా ఉండాల్సింది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కాదని ఇటీవల దంచి కొడుతూ చుక్కలు చూపిస్తున్న సూర్య కుమార్ యాదవ్ అని హెచ్చరించాడు.
సూర్య కుమార్ యాదవ్ ను ఏ మాత్రం ఉపేక్షిస్తే ప్రమాదమని పేర్కొన్నారు. అంతే కాదు యాదవ్ ను సూర్య భాయ్(Surya Kumar Yadav) అంటూ పిలవడం విశేషం.
Also Read : ఆసియా కప్ లో ఆ ఐదుగురిపై ఫోకస్