ICC T20 Rankings : టి20 ర్యాంకింగ్స్ లో సూర్య..హ‌స‌రంగ టాప్

డిక్లేర్ చేసిన ఐసీసీ..రెండో ప్లేస్ లో రిజ్వాన్

ICC T20 Rankings : భార‌త క్రికెట్ లో స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన సూర్య కుమార్ యాద‌వ్ మ‌రో ఘ‌న‌త‌ను సాధించాడు. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టీ20లో స‌త్తా చాటిన సూర్య భాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌క‌టించిన టీ20 ర్యాంకింగ్స్(ICC T20 Rankings) లో టాప్ లో నిలిచాడు. 859 పాయింట్లతో సూర్య కుమార్ యాద‌వ్ అగ్ర స్థానంలో నిలిచాడు.

ఆ త‌ర్వాతి స్థానంలో పాకిస్తాన్ క్రికెట‌ర్ ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఎప్ప‌టి లాగే నిలిచాడు. ఇక ఐసీసీ టోర్నీలో సూర్య కుమార్ యాద‌వ్ మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడాడు. 239 ప‌రుగులు చేశాడు. అత‌డి స‌గ‌టు 59.75 ఉండ‌గా 189.68 స్ట్రైక్ రేటు సాధించాడు. ఈ టోర్నీలో టీమ్ ఇండియా త‌ర‌పున ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా ఆడాడు.

కానీ సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకున్న భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోర‌మైన ఓట‌మిని చ‌వి చూసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడి పోయింది. ఈ మ్యాచ్ లో బాగా ఆడ‌తాడ‌ని అనుకున్న సూర్య కుమార్ యాద‌వ్ (Surya Kumar Yadav) 14 ప‌రుగుల‌కే చాప చుట్టేశాడు. ఇదిలా ఉండ‌గా మ‌హ్మ‌ద్ రిజ్వాన్ 836 పాయింట్లు సాధించాడు.

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ మూడో స్థానంలో నిలిచాడు. 778 పాయింట్లు వ‌చ్చాయి. ఇక బ్యాట‌ర్ల‌తో పాటు బౌల‌ర్ల ప‌రంగా కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ ను ప్ర‌క‌టించింది.

శ్రీ‌లంక కు చెందిన వ‌నిందు హ‌స‌రంగ టాప్ లో నిలిచాడు. ఆ త‌ర్వాతి స్థానంలో ఆఫ్గ‌నిస్తాన్ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్ , ఇంగ్లండ్ కు చెందిన ర‌షీద్ మూడో ప్లేస్ లో , ఆస్ట్రేలియాకు చెందిన హేజిల్ వుడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ కు చెందిన మ‌రో బౌల‌ర్ సామ్ క‌ర‌న్ ఐదో స్థానం సంపాదించాడు.

Also Read : వ‌ర్ధ‌మాన ఆట‌గాళ్ల‌కు బోలెడ‌న్ని అవ‌కాశాలు

Leave A Reply

Your Email Id will not be published!