Surya Kumar Yadav : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. 158 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది ముంబై. ప్రధానంగా సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) మరోసారి సత్తా చాటాడు.
51 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. యాదవ్ తో పాటు తెలుగు వాడైన తిలక్ వర్మ మరోసారి మెరిశాడు. 35 రన్స్ చేసి విజయానికి బాటలు వేశాడు.
ఈ తరుణంలో ఇషాన్ కిషన్ కూడా సత్తా చాటాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ అసలు పేరు సూర్య కుమార్ అశోక్ యాదవ్(Surya Kumar Yadav). 14 సెప్టెంబర్ 1990లో పుట్టాడు.
అతడికి ఇప్పుడు 31 ఏళ్లు. స్వస్థలం మరాఠా లోని ముంబై. కుడి చేతి వాటం బ్యాటర్. 18 జూలై 2021న శ్రీలంకతో వన్డే లో అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది 11 ఫిబ్రవరిలో విండీస్ తో చివరి మ్యాచ్ ఆడాడు.
2010 , 2012, 2018 దాకా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2014 నుంచి 2017 దాకా కోల్ కతా నైట రైడర్స్ కు ఆడాడు. అప్పుడప్పుడు కుడి చేతి వాటం బౌలర్, స్పిన్నర్ కూడా.
చిన్నప్పటి నుంచి సూర్య కుమార్ యాదవ్ కు క్రికెట్ , బ్యాడ్మింటన్ అంటే పిచ్చి. తండ్రి ఇంజనీర్. ముంబై వీధుల్లో ఆడుకుంటూ నైపుణ్యం సంపాదించాడు. బార్క్ కాలనీలో క్రికెట్ క్యాంప్ లో చేరాడు.
వెంగ్ సర్కార్ అకాడెమీలో చోటు సంపాదించాడు. 2010-11 లో రంజీ జట్టుకు ప్రాతినిధ్యం చేశాడు. దేశీవాలి క్రికెట్ లో మెరిశాడు. అద్భుతంగా రాణించాడు.
Also Read : ధవల్ రాణించేనా ముంబై రాత మారే