Surya Kumar Yadav : అబ్బా సూర్యా భాయ్ దెబ్బ

35 బంతులు 83 ప‌రుగులు

Surya Kumar Yadav : ముంబై స్టార్ క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా మ‌రోసారి చెల‌రేగాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. భిన్న‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. బౌల‌ర్లను ఉతికి ఆరేశాడు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ షాట్స్ కొడుతూ వెళ్లి పోయాడు. సూర్య భాయ్ దెబ్బ‌కు బెంగ‌ళూరు త‌ల్ల‌డిల్లింది. ఆర్సీబీ నిర్దేశించిన భారీ ల‌క్ష్యం సూర్య ముందు చిన్న బోయింది.

దీంతో 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం 16.3 ఓవ‌ర్ల‌లోనే ముంబై ఇండియ‌న్స్ పూర్తి చేసింది. ఏకంగా పాయింట్ల ప‌ట్టిక‌లో 3వ స్థానానికి ఎగ‌బాకింది. ప్లే ఆఫ్ రేసులోకి దూసుకెళ్లింది. నిన్న‌టి దాకా పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర నిరాశ ప‌రిచిన ఆ జ‌ట్టు ఉన్న‌ట్టుండి ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. విచిత్రం ఏమిటంటే మ‌రోసారి ముంబై ఇండియ‌న్స్ స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ నిరాశ ప‌రిచాడు. హ‌స‌రంగా బౌలింగ్ లో 7 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. అంపైర్ నాటౌట్ ప్ర‌క‌టిస్తే మూడో అంపైర్ ఔట్ గా డిక్లేర్ చేశాడు.

ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో రోహిత్ సేన దుమ్ము రేపింది. ముంబై స్టార్ క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ రెచ్చి పోయాడు. 35 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 83 ప‌రుగులు చేశాడు. ముంబై ఇండియ‌న్స్ గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. ఇందులో 7 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఉన్నాయి.

సూర్య‌తో(Surya Kumar Yadav )పాటు వ‌ధేరా ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 52 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అంత‌కు ముందు ఓపెన‌ర్ గా వ‌చ్చిన ఇషాన్ కిష‌న్ దంచి కొట్టాడు. ఆర్సీబీ బౌలర్ల‌పై దాడి చేశాడు. 42 ర‌న్స్ చేశాడు.

Also Read : వ‌ధేరా ఇన్నింగ్స్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!