Surya Kumar Yadav Smash : క‌దం తొక్కిన సూర్యా భాయ్

లంకేయుల‌కు బిగ్ షాక్

Surya Kumar Yadav Smash : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ లో కొన‌సాగుతున్న భార‌త విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ సూర్య కుమార్ యాదవ్ అలియాస్ సూర్య భాయ్ మ‌రోసారి రెచ్చి పోయాడు(Surya Kumar Yadav). సీరీస్ ను నిర్దేశించే కీల‌క‌మైన మూడో టీ20 మ్యాచ్ లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపాడు.

మైదానం అంత‌టా అద్బుత‌మైన షాట్స్ అల‌రించాడు. దీంతో రాజ్ కోట్ లో క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. సూర్య కుమార్ యాద‌వ్(Surya Kumar Yadav) క‌సితీరా ఆడాడు. లంకేయుల బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో భార‌త్ 5 వికెట్లు కోల్పోయి 228 ర‌న్స్ చేసింది. కేవ‌లం 45 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సూర్య భాయ్ ఏకంగా సెంచ‌రీతో క‌దం తొక్కాడు.

భార‌త జ‌ట్టు త‌ర‌పున అత్యంత ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా చ‌రిత్ర న‌మోదు చేశాడు సూర్య‌. రోహిత్ శ‌ర్మ నెంబ‌ర్ వ‌న్ లో ఉన్నాడు. కేవ‌లం 35 బంతుల్లో శ‌త‌కం బాదాడు. హిట్ మ్యాన్ కూడా శ్రీ‌లంక‌పై వేగ‌వంత‌మైన సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇవాల్టి సెంచ‌రీతో సూర్య కుమార్ యాద‌వ్ కు ఇది మూడో సెంచ‌రీ కావ‌డం విశేషం.

ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ తో క‌లిసి స్కోర్ ను ప‌రుగులు పెట్టించాడు. రాకెట్ కంటే వేగంగా స్కోర్ ప‌రుగులు తీసింది. శుభ్ మ‌న్ గిల్ 48 ర‌న్స్ చేస్తే చివ‌ర‌లో అక్ష‌ర్ ప‌టేల్ 21 ప‌రుగులు చేశారు. దీంతో చివ‌ర‌లో 9 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు. మ‌రో వైపు సంజూ శాంస‌న్ స్థానంలో వ‌చ్చిన రాహుల్ త్రిపాఠి 35 ర‌న్స్ తో రాణించాడు.

Also Read : స‌ర్ఫ‌రాజ్ శ‌త‌కం భార్య భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!