Surya Kumar Yadav : అబ్బా ‘సూర్యా’ భాయ్ దెబ్బ
షాన్ దార్ ఇన్నింగ్స్ తో షాక్
Surya Kumar Yadav : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ చెప్పిందే నిజమైంది. భారత జట్టుతో ఆడేటప్పుడు మిగతా ఆటగాళ్ల కంటే సూర్య భాయ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఎవరీ సూర్య భాయ్ అనుకుంటున్నారా. ఇటీవలి కాలంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న భారతీయ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్. ఆసియా కప్ 2022 లో(Asia Cup 2022) భాగంగా యూఏఈ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో శివమెత్తాడు.
పూనకం వచ్చిన వాడిలా ఊగి పోయాడు. బంతుల్ని అలవోకగా బౌండరీలు దాటించాడు. ఆపై కళ్లు చెదిరే షాట్స్ తో సిక్సర్ల మోత మోగించాడు. దీంతో హాంకాంగ్ బౌలర్లకు ఏం చేయాలో పాలు పోలేదు.
అంతలా మెస్మరైజ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav). మ్యాచ్ విషయానికి వస్తే హాంకాంగ్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన రోహిత్ శర్మ నిరాశ పరిస్తే కేఎల్ రాహుల్ పర్వా లేదని అనిపించాడు.
ఆ తర్వాత రన్ మెషీన్ 59 పరుగులతో నాటౌట్ గా నిలిస్తే సూర్య కుమార్ యాదవ్ మాత్రం తన సత్తా ఏమిటో నిరూపించాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. మొత్తం 68 పరుగులు చేశాడు.
ఇందులో 6 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 192 పరుగులు చేసింది. అనంతరం హాంకాంగ్ టార్గెట్ ఛేదించ లేక చేతులెత్తేసింది.
అత్యంత ప్రమాదకరమైన ఇన్నింగ్స్ ఆడాడు సూర్య. అక్రమ్ తో పాటు ఆసిస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కూడా సూర్య కుమార్ యాదవ్ పట్ల జాగ్రత్తంగా ఉండాలన్నాడు.
Also Read : హాంకాంగ్ పై భారత్ అలవోక విజయం