Sunil Jakhar : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖర్(Sunil Jakhar )కు కోలుకోలేని షాక్ ఇచ్చింది హైకమాండ్. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జాఖర్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై నోరు పారేసుకున్నారు.
అంతే కాకుండా ఆయన దళితుడిని చూడకుండా కుల దూషణ చేశారంటూ ఆ పార్టీకి చెందిన నాయకులే ఆరోణలు చేశారు. ఆపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు.
ఒక దళితుడిని సీఎం చేస్తే తట్టుకోలేక పోతున్నారని, ఆయన పార్టీకి మేలు కంటే నష్టమే ఎక్కువ చేకూర్చారంటూ ఆరోపించారు. ఇదే సమయంలో తాను అలా అనలేదని, కావాలనే కొందరు ఇలా బద్నాం చేస్తున్నారంటూ వాపోయారు సునీల్ జాఖర్(Sunil Jakhar ).
ఇదే విషయంపై సీరియస్ గా స్పందించింది హైకమాండ్. ఈ మేరకు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన జాఖర్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేక పోవడంతో ఆయనపై 2 ఏళ్ల పాటు వేటు వేసేందుకు మొగ్గు చూపింది క్రమశిక్షణ కమిటీ.
ఈ నివేదికను ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ మేడం సోనియా గాంధికి అందజేసింది. దీనిని పరిశీలించిన మేడం జాఖర్ పై వేటు వేయడం కరెక్టేనని స్పష్టం చేసింది. దీంతో సుదీర్గ రాజకీయ అనుభవం కలిగిన సునీల్ జాఖర్ కు ఇది కోలుకోలేని దెబ్బేనని భావించక తప్పదు.
రెండేళ్ల పాటు సస్పెండ్ చేయాలని ప్యానల్ సూచించింది. ఆయనకు ఉన్న పదవులన్నింటిని తొలగించాలని కోరింది. మంగళవారం ఢిల్లీలో సమావేశమైన ఏకే ఆంథోనీ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది.
అంతే కాకుండా జాఖర్ తో పాటు మేఘాలయలో ఎండీఏకు మద్దతు తెలిపిన ఐదుగురు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది.
Also Read : చాలీసా పేరుతో ఇబ్బంది కలిగించొద్దు