Suvendu Adhikari : దీదీకి ద‌మ్ముంటే పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని ఆపాలి

బీజేపీ అగ్ర నేత సువేందు అధికారి స‌వాల్

Suvendu Adhikari : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఆరు నూరైనా దేశ వ్యాప్తంగా ఉమ్మ‌డి పౌర స‌త్వ చ‌ట్టాన్ని తీసుకు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ బెంగాల్ అగ్ర నేత , ప్ర‌తిపక్ష నాయ‌కుడు సువెందు అధికారి(Suvendu Adhikari) . ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై నిప్పులు చెరిగారు.

ఆమె ఇటీవ‌ల కామ‌న్ సివిల్ కోడ్ మీద సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా త‌మ పేర్లు ఓట‌ర్ల జాబితాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. లేక పోతే ఈ దేశంలో పౌరులుగా కాకుండా పోతారంటూ హెచ్చ‌రించింది. ఒక ర‌కంగా కేంద్రాన్ని,

బీజేపీని ఎద్దేవా చేసింది సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. ఉమ్మ‌డి పౌర స‌త్వ చ‌ట్టాన్ని ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటున్నాయి. ప్ర‌త్యేకించి తీవ్ర అభ్యంత‌రం తెలియ చేస్తున్నాయి. ఈ త‌రుణంలో క‌ర్ణాట‌క సీఎం కూడా కామ‌న్ సివిల్ కోడ్ ను త‌ప్ప‌క అమ‌లు చేసి తీరుతామ‌న్నారు. మ‌రో వైపు గుజ‌రాత్ రాష్ట్రంలో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆవిష్క‌రించారు. ఈ మేనిఫెస్టోలో కూడా ఉమ్మ‌డి పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో బీజేపీ అగ్ర నాయ‌కుడు సువేందు అధికారి(Suvendu Adhikari)  సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

సీఎం దీదీకి ద‌మ్ముంటే కేంద్రం తీసుకు వ‌చ్చే ఉమ్మ‌డి పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని ఆపాలంటూ స‌వాల్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : రూ. 90 కోట్ల విలువైన ‘జ‌మాత్ ఇస్లామీ’ ఆస్తులు సీజ్

Leave A Reply

Your Email Id will not be published!