Swami Vivekananda : బతికింది కొద్ది కాలమే అయినా నేటికీ ఆయన భారత దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఇంకా చేస్తూనే ఉంటారు కూడా. ఉక్కు సంకల్పం.
మొక్కవోని ఆత్మ స్థైర్యం. పట్టుదల. కృషి. సంసిద్దత. సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం..ఇలా ప్రతి సందర్భంలోనూ వివేకానందుడు (Swami Vivekananda)గుర్తుకు వస్తాడు.
ఆయన మనల్ని వెంటాడుతాడు. చేతి కర్రగా ఉపయోగ పడతాడు. ఎందుకంటే ఆయన సాగించిన ప్రస్థానం అనంతం. అద్వితీయం. అజరామరం.
అందుకే ఈ దేశం ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఇవాళ ఆ మహానుభావుడు పుట్టిన రోజు. 1863 జనవరి 12. ఆయన జన్మ స్థలం కోలకతా. పూర్తి పేరు నరేంద్ర నాథ్ .
1902 జూలై 4న ఈ లోకాన్ని వీడారు. అచంచలమైన సత్ సంకల్పాల్ని కలిగిన యోగి ఆయన.
చికాగో వేదికగా వివేకానందుడు చేసిన ప్రసంగం నేటికీ చిరస్థాయిగా నిలిచి పోయింది.
బేలూరు మఠం. రామకృష్ణ మఠం. రామకృష్ణ మిషన్ ఆయన స్థాపించారు. ఇప్పటకీ ఇతోధికంగా సేవలు అందిస్తున్నాయి.
తాత్వికుడు. యోగి కూడా. రాజయోగ, కర్మ యోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ రాశారు.
ఆయన శిష్యులు ఎందరో ప్రముఖులు ఉన్నారు. రామకృష్ణ పరమ హంస ప్రియ శిష్యుడుగా పేరొందాడు.
వేదాంత, యోగ, తత్వ శాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించాడు.
హిందూ తత్వ చరిత్ర, భారత దేశ చరిత్రలలో ఆయన ప్రముఖ వ్యక్తిగా పేరొందారు. భారత దేశాన్ని జాగృతం చేశాడు. పలు దేశాలు పర్యటించాడు. వివేకానందుడి వాగ్ధాటికి ప్రపంచం విస్తు పోయంది.
పాశ్చాత్య దేశాల్లోకి అడుగు పెట్టిన మొదటి సన్యాసి. భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును జాతీయ యువజన దినోత్సవంగా(Swami Vivekananda ప్రకటించింది. వివేకానందుడు కొన్ని రోజుల పాటు ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు.
న్యాయ విద్య కొనసాగించాడు. రామకృష్ణ పరమహంస మరణిస్తూ ఆయనకు హితబోధ చేశారు.
ఆయన సమాధికి దగ్గరలోనే మఠం ఏర్పాటు చేశాడు. 1893 సెప్టెంబర్ 11న సర్వమత సమ్మేళనంలో పాల్గొనే సమయం వచ్చింది.
అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అని వివేకానందుడు ప్రారంభించాడు. చప్పట్లతో మారుమ్రోగింది.
ఆయన ప్రసంగం ఎందరినో ప్రభావితం చేసింది. తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు.
వివేకానందుడికి ఉన్న ఆంగ్ల భాషా పరిజ్ఞానం అపురూపం. 1897 జనవరి 15న కొలంబోలో దిగాడు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు అన్నాడు.
Also Read : ఐఏఎస్ కు వన్నె తెచ్చిన భరత్ గుప్తా