Team India : తీరు మార్చుకోని ఆటగాళ్ల‌తో ప‌రేషాన్

ఇక‌నైనా మారండి దేశం కోసం ఆడండి

Team India : కోట్లాది అభిమానులు క‌లిగిన ఏకైక ఆట ఏదైనా ఉందంటే అది భార‌త క్రికెట్ జ‌ట్టు మాత్ర‌మే. కోట్లాది రూపాయ‌ల ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ బీసీసీఐ. లెక్క‌లేనంత డ‌బ్బు.

లెక్కించినంత ప‌ర‌ప‌తి. కానీ ఇవేవీ టీమిండియాను(Team India) ప్ర‌భావితం చూప‌లేక పోతున్నాయి. అద్భుత‌మైన ఆటగాళ్లు ఉన్నారు. దుమ్ము రేపే స‌త్తా చాటే ప్లేయ‌ర్లు ఉన్నా ఎందుక‌నో అస‌లైన టైంలో చేతులెత్తేస్తున్నారు.

లోపం ఎక్క‌డుంది. ఎవ‌రిలో ఉంద‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌పంచ క్రికెట్ ను ఒంటి చేత్తో శాసించే ఆట‌గాళ్లు మ‌న జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌ని విజ‌యం వైపు దూసుకు వెళ్ల‌డం లేద‌నే అనుమానం క‌లుగుతోంది.

ఎక్కువ కాలం క్రికెట్ ఆడ‌ట‌మా లేక ఆట‌పై ఫోక‌స్ పూర్తిగా ఫోక‌స్ పెట్టేలేక పోతున్నారా అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టీ20 మెగా టోర్నీలో దాయాది పాకిస్తాన్ తో ఘోరంగా ఓడి పోయారు.

ఏకంగా 10 వికెట్ల తేడాతో అప‌జ‌యం పాల‌య్యారు. దేశం ప‌రువు మంట‌గ‌లిపారు. ఆ త‌ర్వాత స్వ‌దేశంలో కీవీస్ తో ప‌ర్వా లేద‌ని అనిపించినా స‌ఫారీ టూర్ లో ఒక్క సెంచూరియ‌న్ టెస్టు మిన‌హా ఏ మ్యాచ్ లోనూ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించ లేక పోయారు.

ప‌నిగ‌ట్టుకుని బీసీసీఐ రాహుల్ ద్ర‌విడ్ ను ఏరికోరి హెడ్ కోచ్ గా నియ‌మించింది. మిస్ట‌ర్ కూల్ గా పేరొందిన ద్ర‌విడ్ రాక‌తో టీమిండియా(Team India) త‌ల రాత మారుతుంద‌ని అంతా భావించారు.

కానీ మ‌నోళ్ల ఆట తీరు ప‌రిశీలిస్తే ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌నైనా ఆటగాళ్లు దేశం వైపు చూడాలి.

ఈ దేశం కోసం ఆడుతున్నామ‌న్న ఆలోచ‌న‌తో ఆడేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. లేక పోతే జ‌ట్టు ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

Also Read : కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఫెయిల్

Leave A Reply

Your Email Id will not be published!