Brett Lee : సైమండ్స్ డబ్బు..కీర్తి కోసం ఆడలేదు
బ్రెట్ లీ భావోద్వేగ పూరితమైన నివాళి
Brett Lee : నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ఆండ్రూ సైమండ్స్ ఒకడు. దిగ్గజ ఆటగాడిని మేం కోల్పోయాం. ఇది క్రీడా లోకానికి , యావత్ ప్రపంచానికి ప్రత్యేకించి ఆస్ట్రేలియా క్రికెట్ కు తీరని లోటు.
దీనిని ఎప్పటికీ పూర్తి చేయలేం. మొన్నటికి మొన్న ప్రపంచాన్ని తన మణికట్టు బంతులతో శాసించిన క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ ను కోల్పోయాం. ఇప్పుడు మృత్యువు ఈ రూపంలో ఇంత త్వరగా సైమండ్స్ ను తీసుకు వెళుతుందని మేం ఊహించ లేదు.
ఇది మా క్రికెటర్లందరికీ ప్రత్యేకించి నాకు తీరని లోటు. అంతులేని దుఖాఃన్ని కలిగించిందని వాపోయాడు ఆసిస్ స్టార్ బౌలర్ బ్రెట్ లీ(Brett Lee). ఇవాళ నాకు మాటలు రావడం లేదు.
చాలా చిన్న వయసు ఆండ్రూ సైమండ్స్ ది. నేను చిన్నతనంలో ఆయనను దగ్గరుండి చూశాను. ఎన్నో నేర్చుకున్నాను కూడా. సైమండ్స్ గురించి నేను ఈ యావత్ క్రికెట్ లోకానికి తెలియ చేయాలని అనుకుంటున్నాను.
అదేమిటంటే ఈ దిగ్గజ క్రికెటర్ ఎప్పుడూ డబ్బు కోసమో లేదా పరపతి కోసం, ప్రచారం కోసమో ఆడలేదని స్పష్టం చేశాడు. వర్దమాన క్రికెటర్లను ప్రోత్సహిస్తూ వచ్చాడు.
ఆయన గురించి తెలిసింది కొంతే. తెలుసు కోవాల్సింది చాలా ఉందన్నాడు బ్రెట్ లీ(Brett Lee). 1998 నుండి 2009 దాకా 26 టెస్టులు 198 వన్డేలు ఆడిన ఆండ్రూ సైమండ్స్ కు ఉద్వేగ భరితమైన నివాళి అర్పించాడు.
అతడి హార్ట్ హిట్టింగ్ మాత్రమే కాదు అరుదైన వ్యక్తిత్వం కూడా ఎప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బ్రెట్ లీ.
Also Read : రాజస్థాన్ జట్టులో చేరిన స్టార్ హిట్టర్