T-HUB Won : టి హ‌బ్ కు అరుదైన పుర‌స్కారం

ప‌నితీరుకు గాను అవార్డు

T-HUB Won : హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌భుత్వంలోని ఐటీ శాఖ‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఐటీ ఆధ్వ‌ర్యంలో మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేసిన టి హ‌బ్ కు పుర‌స్కారం ల‌భించింది. అద్భుత‌మైన ప‌నితీరుతో ఆక‌ట్టుకుంది స‌ద‌రు సంస్థ. టెక్నిక‌ల్ గా స్టార్ట‌ప్ ల‌కు, టెక్నాల‌జీ ప‌రంగా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తోంది. ఇన్నోవేష‌న్స్ కు కేరాఫ్ గా నిలిచింది టి హ‌బ్.

T-HUB Won Appreciations

దీనిని త‌న స్వంత బిడ్డ లాగా చూసుకుంటున్నారు మంత్రి కేటీఆర్(KTR). దేశంలోనే ప్రాముఖ్య‌త క‌లిగి ఉన్న‌ది టిహ‌బ్. ఇందుకు గాను ఐటీ ప‌రంగా దూసుకు పోతున్న టి హ‌బ్ ప‌నితీరుకు, స‌క్సెస్ కు గుర్తింపు ల‌భించింది. ఈ మేర‌కు దుబాయి వేదిక‌గా హ‌బ్ సౌత్ ఇండియా బిజినెస్ 2023 సంవ‌త్స‌రానికి గాను అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.

ఇందులో తెలంగాణ‌కు చెందిన టి హ‌బ్ సంస్థ‌ను ఎంపిక చేసింది. ఈ మేర‌కు టి హ‌బ్ సిఇవో గురువారం సంస్థ త‌ర‌పున పుర‌స్కారాన్ని స‌ద‌రు సంస్థ నుండి అందుకున్నారు. ఇప్ప‌టికే కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా కొలువు తీరాక పెద్ద ఎత్తున కంపెనీలు హైద‌రాబాద్ కు తీసుకు రావ‌డంలో కృష్టి చేశారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ హైద‌రాబాద్ బాట ప‌ట్టాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా టి హ‌బ్ కు అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

Also Read : RTC Bill Approved : ఆర్టీసీ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

Leave A Reply

Your Email Id will not be published!