T20 Team India Squad : టి20 వరల్డ్ కప్ భారత జట్టు డిక్లేర్
సంజూ శాంసన్ కు మొండి చేయి
T20 Team India Squad : బీసీసీఐ సెలెక్టర్లు మరోసారి మొండి చేయి చూపారు కేరళ స్టార్ సంజూ శాంసన్ కు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టి20 వరల్డ్ కప్ తో పాటు ఇతర టోర్నీలకు కూడా టీమిండియాను ఎంపికే చేసింది.
ఇందులో నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లను(T20 Team India Squad) ప్రకటించారు. షమీ, దీపక్ చాహర్ , రవి బిష్ణోయ్ , శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
ఐసీసీ టి20 వరల్డ్ కప్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్. కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ , దీపక్ హూడా, రిషబ్ పంత్ , దినేష్ కార్తీక్ , హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ , యుజ్వేంద్ర చాహల్ , అక్షర్ పటేల్ , బుమ్రా, భువనేశ్వర్ కుమార్ , హర్షల్ పటేల్ , అర్ష్ దీప్ సింగ్ ఉన్నారు.
ఇక ఆస్ట్రేలియా జట్టుతో ఆడే టి20 జట్టు ఇలా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ , కేఎల్ రాహుల్ వైఎస్ కెప్టెన్ . కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ , పంత్ , కార్తీక్ , పాండ్యా, ఆర్. అశ్విన్ , చాహల్ , అక్షర్ పటేల్ , భువీ, షమీ , హర్షల్ పటేల్ , దీపక్ చాహర్, బుమ్రా ఆడతారు.
ఇక దక్షిణాఫ్రికా టి20 కోసం భారత జట్టును కూడా డిక్లేర్ చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ , కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ , దీపక్ హూడా, పంత్, కార్తీక్ , ఆర్. అశ్విన్ , చాహల్ , అక్షర్ పటేల్ , అర్ష్ దీప్ సింగ్ , షమీ, హర్షల్ పటేల్ , దీపక్ చాహర్ , బుమ్రా ఉన్నారు.
మొత్తంగా మరోసారి కేరళ స్టార్ కు అన్యాయం చేశారు. శాంసన్ ను ఎంపిక చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
Also Read : ఇండియన్ జర్నలిస్ట్ పై రమీజ్ రజా ఫైర్