T20 World Cup 2022 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ ఇవాళ టీ20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్(T20 World Cup 2022) ను ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 23న ఐకానిక్ మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్తాన్ తో భారత జట్టు ఆడనుంది.
ఎంసీజీ వేదికగా రెండు ఆసియా జట్ల మధ్య జరుగుతున్న తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఇది. 2015లో అడిలైడ్ ఓవెల్ లో ఆస్ట్రేలియాలో ఇండియా, పాకిస్తాన్ జట్లు చివరి సారిగా వరల్డ్ కప్ లో తలపడ్డాయి.
ఈ టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16న ప్రారంభం అవుతుంది. అడిలైడ్ , బ్రిస్బేన్ , గీలాంగ్ , హోబర్ట్ , మెల్ బోర్న్ , పెర్త్ తో పాటు సిడ్నీలలో ఏడు వేదికలపై ఈ టోర్నీ సాగుతుంది. టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2022) ఫైనల్ నవంబర్ 13న ఎంసీజీలో జరుగుతుంది.
అక్టోబర్ 22న ఆసిస్ , కీవీస్ తలపడతాయి. ఈ రిచ్ లీగ్ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి. మొత్తం 45 మ్యాచ్ లు కొనసాగుతాయి. ప్రస్తుతం భారత్ గ్రూప్ -2లో ఉంది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
టీమిండియాకు మొదటిసారిగా రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అక్టోబర్ 23న ఎంసీజీలో భారత్, పాకిస్తాన్ తో ఆడనుంది. 27న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో గ్రూప్ -ఏ రన్నరప్ తో ఆడుతుంది.
30న పెర్త్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. ఓవల్ వేదికగా నవంబర్ 2న బంగ్లాదేశ్ తో ఆడునుంది. నవంబర్ 6న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో గ్రూప్ బి విజేతతో ఆడుతుంది భారత జట్టు.
Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆసిస్ టాప్