Michael Bevan : టి20 వరల్డ్ కప్ టైటిల్ భారత్ దే
ఆసిస్ మాజీ క్రికెటర్ మైఖేల్ బేవాన్
Michael Bevan : స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టి20 సీరీస్ ను 2-1 తేడాతో గెలుపొందింది భారత జట్టు. టీమిండియా అన్ని ఫార్మాట్ లలో అద్భుత ప్రతిభను కనబరుస్తోంది. ప్రధానంగా మోస్ట్ డేంజరస్ ప్లేయర్ గా మారాడు సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav). ఈ సీరీస్ లో సెంచరీతో భారీగా పరుగులు సాధించి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపికయ్యాడు.
ఇక అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంటో టి20 వరల్డ్ కప్ -2022 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఈపాటికే పలు జట్లు ఆస్ట్రేలియాకు చేరుకుంటున్నాయి. ఇక ఏ జట్టు గెలుస్తుందనే దానిపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆసిస్ కు చెందిన మాజీ క్రికెటర్ మైఖేల్ బేవాన్(Michael Bevan) సంచలన కామెంట్స్ చేశాడు. ఈసారి టి20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్ మాత్రం తన ఛాయిస్ భారత జట్టు వైపేనంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా భారత జట్టుతో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు కూడా గెలిచేందుకు అవకాశం ఉందన్నాడు.
ఇదిలా ఉండగా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ పరంగా చూస్తే భారత జట్టు అద్భుతంగా రాణిస్తోందని కితాబు ఇచ్చాడు మైఖేల్ బేవాన్.
ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే భారత్, ఇంగ్లండ్ , ఆస్ట్రేలియా జట్లకు కూడా టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందన్నారు మైఖేల్ బేవాన్. ఇదిలా ఉండగా బేవాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి క్రికెట్ వర్గాల్లో.
Also Read : అజహరుద్దీన్ సహాయం మరువలేం- బెంజిమన్